హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎక్కువగా ఆస్తులు సంపాదిస్తే ఇటువంటి దురలవాట్లే వస్తాయన్నారు. హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారమే నిదర్శనమని ఆయన అన్నారు. చిత్తూరు పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పని ఒత్తిడి వల్ల నియోజకవర్గానికి రాలేకపోయినా తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపిస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గంలో రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. 14 ఎకరాల 50 సెంట్లను మార్కెట్ కమిటీకి ఇస్తామన్నారు. ఇళ్లల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చంద్రబాబు సూచించారు.
ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు - డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. పేద పిల్లల చదువుల కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పక్కా ఇళ్ల మంజూరుకు ఎవరైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని, అవినీతికి ఎవరైనా పాల్పడితే 1100 నెంబర్ కు ఫోన్ చేయాలని చంద్రబాబు సూచించారు. అవినీతిని ఏమాత్రం సహించబోనని స్పష్టం చేశారు.
బెల్ట్ షాపులు పెట్టొద్దని మర్యాదగా చెప్పినా వినకపోవడంతో బెల్ట్ తీస్తున్నానని అన్నారు. కులాలు - మతాల పేరుతో కొందరు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమాలు జరగకూడదనే ఇసుక నుంచి వచ్చే ఆదాయాన్ని వదులుకున్నామని తెలిపారు.