చంద్రబాబు మంత్రివర్గంలో జగన్?

Update: 2017-03-03 06:44 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులతో నిర్వహించే ప్రతి సమావేశంలో ప్రధాన అజెండా విపక్ష నేత జగనేనట. దాంతో చంద్రబాబు వద్ద పనిచేస్తున్న సీనియర్ మంత్రులు కొందరు మన కేబినెట్లో జగన్ కూడా ఉన్నట్లుంది.. నిత్యం ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం అని సెటైర్లు వేస్తున్నారట. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే చంద్రబాబు ఏకంగా జగన్ కు సంబంధించిన వీడియోలు కూడా ప్రదర్శించడంతో ‘‘ఈ చంద్రబాబుకు ఏమైంది’’ అంటూ పలువురు మంత్రులు నవ్వుకుంటున్నారట.
    
చంద్రబాబు ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనూ  ‘జగన్’ సినిమా చూపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరుతో వాగ్యుద్దానికి సంబంధించిన ఈ వీడియోను  అప్పటికే అంతా టీవీల్లో చూశారు. కానీ చంద్రబాబు దాన్ని మళ్లీ మంత్రులకు బలవంతాన చూపించారు. దీంతో  మంత్రివర్గ సమావేశంలో ఈ సినిమా ఏంటి? అని ఓ సీనియర్ మంత్రి అనేశారట.  అయితే చంద్రబాబు కోసం  జగన్ తీరును మంత్రివర్గ సమావేశం ఖండించింది.
    
కాగా జగన్ తీరుప అధికార పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా వైసీపీ మాత్రం తన వెర్షన్ స్పష్టంగా వెల్లడిస్తోంది. డ్రైవర్ బాడీకి పోస్టుమార్టం చేయకుండానే పంపాలని చూశారని..  అలా చేస్తే  కలెక్టర్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మాత్రమే ప్రతిపక్ష నేత జగన్ అన్నారని..ఇప్పటికీ తాము అదే మాటలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ చెబుతోంది. ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు మంత్రివర్గ సమావేశాల్లో మాత్రం ప్రధాన అజెండా జగనే కావడం ఆశ్చర్యకరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News