అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. ఆ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు కనిపించే కోణంతో పాటు.. ప్రజల కోణాన్ని ఏ నాయకుడైతే సమర్థంగా పసిగడతారో.. ఆ నాయకుడే సక్సెస్ ఫుల్ అవుతారు. ఆ విషయం రాజకీయంగా విశేష అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు చూస్తే.. ఇదేంటిలా మాట్లాడుతున్నారన్న భావన కలగటం ఖాయం. ఎన్నికలకు ముందు.. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్న ఆయన.. ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించటం పెద్ద లోపంగా చెప్పాలి.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చే హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసే అవకాశం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. ఆ విషయం హామీలు ఇచ్చే నేతలకే కాదు.. హామీల్ని విని పరవశించిపోయే ప్రజలకూ తెలుసు. అయితే.. తాము ఇచ్చిన హామీలు మొత్తంగా కాకున్న.. కీలకమైన హామీలు నెరవేరిస్తే.. అదే పదివేలు అన్నట్లుగా ఫీలయ్యే పరిస్థితి.
అయితే.. ఇలాంటి విషయాలు బాబుకు తెలీవో లేక.. తెలిసినా తెలీనట్లుగా ఉంటారో కానీ.. ఎన్నికల సమయంలో తానిచ్చిన చాంతాడంత హామీల్ని పూర్తిగా అమలు చేసేసినట్లుగా కాకినాడ సభలో చెప్పి షాకిచ్చినంత పని చేశారు చంద్రబాబు. ఎందుకంటే.. బాబు ఇచ్చిన హామీల్లో కీలకమైన.. రైతుల రుణమాఫీ.. డ్వాక్రా సంఘాల రుణ విముక్తి.. ప్రతి ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి.. కాపుల్ని బీసీల్లోకి చేర్చటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయన నెరవేర్చాల్సిన హామీలు చాలానే కనిపిస్తాయి. కానీ.. అదేమీ లేకుండా ఎన్నికల వేళ తానిచ్చిన హామీలన్నీ అమలు చేసేసినట్లుగా చంద్రబాబు చెప్పిన మాటల్ని వింటే షాక్ తినాల్సిందే.
ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తరచూ తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబుతో పోలిస్తే.. కేసీఆర్ ఇచ్చిన హామీలు చిట్టా తక్కువనే చెప్పాలి. దీనికి తోడు.. ఆదాయపరంగా ఏపీతో పోలిస్తే తెలంగాణ మరింత మెరుగ్గా ఉండటంతో.. ఆయనిచ్చిన హామీల్ని ఎన్నోకొన్ని పూర్తి చేశారని చెప్పాలి. కేసీఆర్ అంత బోల్డ్ గా తాను ఇచ్చిన హామీల్ని నెరవేర్చానని చెప్పటం బాబులో కొత్త ఆలోచనల్ని రేకెత్తించిందో కానీ.. కేసీఆర్ స్టేట్ మెంట్ ను యథాతధంగా ఇచ్చేసిన వైనం చూసినోళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టే పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేయని చంద్రబాబు నోటి నుంచి.. హామీలన్నీ పూర్తి చేసేశామన్న మాట ఆయన ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బ తీస్తుందనటంలో సందేహం లేదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు.. వెనుకా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.