చంద్రబాబు నాయుడు అంటే పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా - గత నాలుగేళ్లుగా ఆంధ్రా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ప్రచారం మీద ఉన్న యావ అభివృద్ది మీద ఉండదు. అనుకూల మీడియా అండతో తనను తాను రాజకీయాల్లో సీనియర్ నేతగా - విజన్ ఉన్న నేతగా పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా నిలబెడతానన్న చంద్రబాబు ఇప్పటికి మూడు సార్లు శంకుస్థాపన చేసినా ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు. తాత్కాలిక భవనాలకు కోట్ల రూపాయలు తగలేశారు.
అయితే పత్రికల్లో ప్రచారం మాత్రం చంద్రబాబు ఏదో చేయబోతే ఎవరో అడ్డుకున్నట్లు ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు. చంద్రబాబు గురించి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఓ విషయం వింటే అంతా ఆశ్చర్యపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ - ఫేస్ బుక్ సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించడానికి ఏడాదికి ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట. హుబిలో అనే సంస్థకు ఈ మొత్తం చెల్లిస్తున్నారట.
ఇది కాకుండా ఎమ్ గ్రూప్ అనే కంపెనీ ద్వారా 160 మంది మీడియా నిపుణులను పెట్టుకుని దాని కోసం మరో రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అంటే మొత్తం రూ.31 కోట్లు. అసలే ఆదాయం లేదు అంటూ బీద అరుపులు అరిచే చంద్రబాబు కేవలం సోషల్ మీడియా - డిజిటల్ మీడియా ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నాడంటే ప్రజల సొమ్ము విషయంలో చంద్రబాబు చిత్తశుద్ది ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రచారం చేస్తున్నా తమకు ప్రజల నుండి వ్యతిరేకత తప్పడం లేదని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారట.
నాలుగేళ్లు బీజేపీతో జత కట్టి కేంద్రంలో - రాష్ట్రంలో అధికారం పంచుకుని ప్రత్యేకహోదా వద్దు, దాని నుండి ఒరిగేది ఏమీలేదు ప్యాకేజీనే ముద్దు అని అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిందని ప్రచారం మొదలుపెట్టాడు. రాజధాని నిర్మాణానికి - అభివృద్దికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని చేసిన ఆరోపణలు ప్రజలు విశ్వసించకపోవడంతో కేంద్రం నుండి వైదొలిగి ప్రజల దృష్టి మళ్లించాలని భావించినా బాబు పాచికలు పారలేదు. సోషల్ మీడియా అయినా సొంత మీడియా అయినా పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు గానీ .. ప్రచారం చేసుకుంటే గుర్తించరన్న విషయం ఈ సీనియర్ నేతకు ఎందుకు తట్టలేదో.