కర్నూలు పై బాబు డెషిషన్ - మండిపడుతున్నఅఖిల!

Update: 2019-03-10 04:54 GMT
కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎస్వీ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఎస్వీ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి ప్రస్తుతం తెలుగుదేశం నేతగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచినే ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నాలకు అంత సానుకూల ఫలితాలు కనిపించడం లేదు. ప్రత్యేకించి కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎస్వీకి టీజీ కుటుంబంతో పోటీ మొదలుకావడంతో వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో..ఎస్వీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే అటు టీజీ వెంకటేష్  కూడా ఒకే మాట చెబుతున్నారట. తన తనయుడికి కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము టీడీపీలో ఉంటామని లేకపోతే పార్టీని వీడతామని అంటున్నారట.

ఈ నేథఫ్యంలో.. చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారట. ఆర్థికంగా  బలవంతుడు అయిన టీజీని వదులుకోవడానికి బాబు రెడీగా లేరని.. అందుకే ఎస్వీ మోహన్ రెడ్డికి బదులుగా టీజీ భరత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారట. ఈ మేరకు ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి  కూడా ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా సమాచారం.

జిల్లాలో ఎస్వీకి బంధుగణం గట్టిగానే ఉంది. టీడీపీ నేతగా - మంత్రిగా ఉన్న ఫిరాయింపు నేత భూమా అఖిల ఎస్వీకి మేనకోడలే అని చెప్పనక్కర్లేదు. ఇక నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి రూపంలో మరో బంధువు కూడా ఉన్నాడక్కడ. ఇలాంటి నేపథ్యంలో వారి ద్వారా ఎస్వీ ఒత్తిడి తీసుకు వస్తున్నారట.

ఇస్తే తమ ముగ్గురికీ టికెట్లు ఇవ్వాలని.. ఎవరైనా ఒకరికి ఇవ్వకపోయినా తామంతా టీడీపీని వీడటం ఖాయమని వారు హెచ్చరిస్తున్నట్టుగా సమాచారం. అయితే బాబు ఈ హెచ్చరికలను లైట్ తీసుకున్నారని, టికెట్లు కేటాయించకపోయినా వారు టీడీపీని వీడలేరని, మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని బాబు అనుకుంటున్నట్టుగా భోగట్టా! అందుకే ఎస్వీ మోహన్ రెడ్డికి కాకుండా టీజీ భరత్ కే కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి బాబు నిర్ణయించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది!
Tags:    

Similar News