ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలికలు పెరిగాయి. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న ఏపీ సర్కారు.. అందులో భాగంగా భారీ ప్రచారాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ మీడియా సంస్థలతో చంద్రబాబు శుక్రవారం నుంచి వరుసగా ప్రత్యేక ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.
ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి బాబు చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. తమను దేవతలుగా పోల్చుకుంటూ.. విపక్ష నేతను రాక్షసులతో పోల్చిన చంద్రబాబు వ్యాఖ్యల్ని చూస్తే.. దేవతలకు కూడా రాక్షసుల బాధ తప్పులేదని.. మంచితోపాటు చెడు కూడా ఉంటుందని అందుకు జగన్ నిదర్శనంగా చెప్పుకొచ్చారు.
తనను నమ్మిన వారి జీవితాలు బాగుండాలన్నదే తన కోరికగా చెప్పిన చంద్రబాబు.. అంతకు మించి తనకు ఎలాంటి ఉద్దేశాలు లేవని.. మంచి పేరు తెచ్చుకోవటానికి మించిన ఆశ తనకు మరొకటి లేదని.. ప్రజల మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశయంగా చెప్పుకొచ్చారు. జీతాల్లేని స్థితి నుంచి హైదరాబాద్ ను హైటెక్ సిటీగా మార్చి సంపదను సృష్టించానని.. అదే మేజిక్ ను అమరావతిలో మరోసారి చేస్తానన్న భరోసాను ఇచ్చారు. తనను తాను గొప్పగా చెప్పుకునే క్రమంలో విపక్ష నేతను రాక్షసుడిగా చిత్రీకరించటం సరికాదన్న మాట వినిపిస్తోంది.