ఒకరేమో మావోయిస్టు అగ్రనేత.. ఇంకొకరు ప్రభుత్వాధినేత. ఆ ఇద్దరూ ఒకరినొకరు వేటాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. ఇదీ ఏపీలో సీఎం చంద్రబాబు వర్సెస్ మావోయిస్టు అగ్రనేత ఆర్కే మధ్య సాగుతున్న పోరు.
ఏపీ అధినేత చంద్రబాబును మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు.. పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు కేంద్ర నిఘా విభాగాలు కూడా ఇప్పటికే హెచ్చరించాయి. ఏవోబీలో మంచంగిపుట్టు భారీ ఎన్ కౌంటర్.. అందులో ఆర్కే తప్పించుకోవడం తరువాత మావోయిస్టులు చంద్రబాబును ప్రధాన టార్గెట్ గా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆర్కే లక్ష్యంగా ఏవోబీలో వేట సాగిస్తోందని తెలుస్తోంది. ఆ ఎన్ కౌంటర్ తరువాత పలుమార్లు ఏవోబీలో ఎదురు కాల్పులు జరిగాయి. ఆర్కే రెండు సార్లు తప్పించుకున్నాడు.
ప్రస్తుతం కూడా వారం రోజులుగా ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల అగ్రనేతలు సమావేశమయ్యారని సమాచారం తెలియడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకపక్క పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేయగా, మరోపక్క మావోయిస్టులు పోస్టర్లను గోడలకు - చెట్లకు అంటిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఒడిశాలోని నారాయణపట్నం లల్లేరి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. డంప్ కూడా దొరికింది. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఆర్కే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్కేను ఎలాగైనా మట్టుపెట్టాలన్న లక్ష్యంతో పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే.. సీఎం చంద్రబాబుపైనా మావోయిస్టులు మరింత గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. రీసెంటుగానూ ఆయనపై హైదరాబాద్ లో రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/