2019 సీటుకు ఇప్పుడే పరీక్ష పెట్టిన చంద్రబాబు

Update: 2017-05-30 08:12 GMT
ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు నాన్చే అలవాటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి రూటు మారుస్తున్నారు. సరైన పనితీరు కనబరచని నేతలను, అవకాశాలిచ్చినా కూడా మారని నేతలను పక్కన పెట్టేందుకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తాజాగా మొదలవుతున్న ఈ కసరత్తు ఏడాదిలోగా ఎమ్మెల్యేలు - ఎంపీల భవిష్యత్తును తేల్చేయనుంది.  సో... లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇప్పటి నుంచే పరీక్ష ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పెడుతున్న ఈ పరీక్షల్లో పాస్ కాకపోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి వారంతా జాగ్రత్త పడుతున్నారు.
    
ఇటీవల చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతున్నారు.  ఈ సందర్భంగా ఆయన వారికి వారి మూడేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టు చేతిలో పెట్టి క్లాసు పీకుతున్నారు. ముఖ్యంగా పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు ఆయన ఖరాకండిగా ఓ విషయం చెప్తున్నారట. వచ్చే మహానాడు ముగిసిన మరుసటి రోజుకల్లా ప్రగతి సాధించకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెటు ఉండదని చెప్తున్నారట.
    
పనిలో పనిగా వారు తమ పనితీరు మెరుగుపర్చుకోవడం కోసం చంద్రబాబే స్వయంగా ఏమేం చేయాలో చెప్పే ఒక జాబితా ఇచ్చి దాన్ని ఫాలో కావాలని సూచిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యేలంతా పరుగులు తీయాల్సిందేనన్న మాట . లేకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు పాయే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News