చాలా ఆర్భాటంగా మునుపెన్నడూ ఏ ముఖ్య మంత్రి చేయని రీతిలో పెట్టుబడుల కోసం తదేక దీక్షతో చేపట్టిన యాత్రగా అమెరికా వెళ్ళిన బాబు బృందానికి చుక్కలు కనిపిస్తున్నాయా అంటే ఔను అనే సమాధానం వీడియోలతో సహా దొరుకుతోంది. ప్రవాసాంధ్రులను ఆకట్టుకుని వాళ్ళతో పోగిడించుకుని ముందు వెళ్ళటమే అజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. నిన్న సోషల్ మీడియా తో పాటు ఆన్ లైన్ లో వైరల్ గా మారిన ఒక వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కాలిఫోర్నియా శాన్ జోస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అతిధిగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడ్డం కోసం భారీ ఏర్పాట్లతో స్టేడియం లో సభను ఏర్పాటు చేసారు. యధాలాపంగా ఇండియన్ టైం డిసిప్లిన్ మైంటైన్ చేసిన బాబు బ్యాచ్ అక్కడ కూడా అదే చేయబోయి బొక్క బోర్లా పడింది.
సాయంత్రం ఆరింటికి అని అనౌన్స్ చేసి తీరా అందరు వచ్చి కూర్చున్నాకా తొమ్మిదికి విచ్చేసింది బాబు టీం. అప్పటికే విసుగు చెందిన అధిక శాతం ఆంధ్రులు ఏంటి మాకీ ఖర్మ అని తిట్టుకుంటూ సభా స్థలిని బాబు రాకముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎన్ఆర్ఐ ల సంక్షేమం గురించి ఏమైనా మాట్లాడతారేమో అని ఆశించిన కొందరు అలాంటిది ఏమి ఉండదు అని ముందుగానే తెలియటంతో మొహం చాటేస్తున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంది.
అమెరికా పర్యటన ముందు నుంచి మార్కెటింగ్ చేసుకున్నట్టు పెట్టుబడుల కోసం అని అన్నారు కాని తీరా అక్కడికి చేరుకున్నాకా భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రమశిక్షణ గురించి పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా రావడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా సోషల్ మీడియా లో ప్రభుత్వ అవినీతి గురించి, మంత్రుల అజ్ఞానం గురించి, ప్రజా ప్రతినిధుల తనయుల ఆగడాల గురించి కథలు కథలుగా రావడం పట్ల వాళ్ళంతా ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నారు అనేది బహిరంగ సత్యం.
దీనికి తోడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన మరుసటి రోజే సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సంస్థ నకిలీ ఐటి సంస్థలపై దాడి చేసినప్పుడు అందులో బాబు తో ఒప్పందాలు కూడా చేసుకునే కంపనీలు కూడా ఉండటంతో తమ్ముళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. మరి ఇవన్నిఏమి జరగనట్టు అమెరికా యాత్ర బ్రహ్మాండంగా జరుగుతోంది అని పదే పదే ప్రచారం చేయటం పట్ల కూడా ప్రవాసాంధ్రులలో అసంతృప్తికి కారణం అవుతోంది. అమెరికా పెట్టుబడులు అంటే ఏదో షాపింగ్ లో సులభంగా కొనే వస్తువుల్లాగా ఇక్కడ టిడిపి మంత్రులు చెప్పడంలోనే అమాయకత్వం బయట పడుతోంది. మరి వైజాగ్ సమ్మిట్ లలో పది లక్షల కోట్లు వచ్చినట్టు గానే అమెరికావి కూడా వస్తాయి అనుకోవాలేమో.