ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల భూములకు మంచి గిరాకీ పలుకుతోంది. ఈ గిరాకీ ఎంతవరకు వచ్చిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరాలకే భూమి దొరకని పరిస్థితి ఏర్పడింది. అవును... రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసం కోసం తాడేపల్లి మండలంలో కృష్ణానది ఒడ్డునే లింగమనేని గెస్టుహౌస్‌ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయతే.. పక్కనే ఉన్న మరో గెస్ట్ హౌస్‌నూ తీసుకుని దానికి కలపబోతున్నారు.
వాస్తు ప్రకారం సీఎం గెస్ట్‌హౌస్‌కు ఈశాన్యంలో రహదారి ఉండాలని సిద్ధాంతి చెప్పడంతో అక్కడ స్థలం కొనుగోలు చేయాలని భావించారు. కానీ ఆ పొలం గల రైతు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారట. తన పొలంలోనుంచి రోడ్డు కోసం తోవ ఇవ్వనని కరాఖండీగా చెప్పేశాడట. అంతగా కావాలనుకుంటే ఎకరా స్థలం మాత్రం ఇస్తానని... ధర 7 కోట్లు అని చెప్పాడట.. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారట. ప్రభుత్వ అవసరాల కోసం కదా పెద్ద మనసు చేసుకోమని అధికారులు కోరగా ఆయన కాస్త దిగొచ్చి 5 కోట్లయితే ఓకే అన్నాడట. కానీ.. అధికారులు మాత్రం ఆ ధరకు తీసుకోవాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నారట. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.