త‌మ్ముళ్ల స్పీడ్‌ కు బాబు బ్రేకులు!

Update: 2016-05-06 09:58 GMT
ఏపీకి న‌ష్టం వాటిల్లేలా ఏదైనా జ‌రిగితే తెలంగాణ నేత‌ల‌తో పోలుస్తూ ఏపీ నేత‌ల్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేస్తుంటారు. ఏపీ నేత‌లు పారిశ్రామిక‌వేత్త‌లు కావ‌టంతోనే వారు గ‌ళం విప్ప‌లేక‌పోతున్నార‌ని మండిప‌డుతుంటారు. ఏపీ నేత‌ల్లో రాజ‌కీయం పాళ్లు త‌క్కువ‌ని.. వ్యాపార ధోర‌ణే ఎక్కువ‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి. అయితే.. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాలే కానీ.. ఎదుటోడు ఎలాంటోడైనా స‌రే తాట తీస్తామ‌న్న‌ట్లుగా ఏపీ త‌మ్ముళ్లు గ‌డిచిన రెండు.. మూడు రోజులుగా చెల‌రేగిపోతున్న తీరు చూసినోళ్లు ఆశ్చ‌ర్యపోవ‌టం తెలిసిందే.  

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా లేద‌ని కేంద్ర‌మంత్రి లోక్‌ స‌భ‌లో తేల్చేయ‌టం.. ఏపీకి ఇంత అన్యాయం చేస్తారా? అన్న మాట‌ను మిత్రుల‌న్న మొహ‌మాటాన్ని ప‌క్క‌న పెట్టేసి ఘాటు విమ‌ర్శ‌నాస్త్రాల్ని త‌మ్ముళ్లు షురూ చేయటం తెలిసిందే. వీరి మాట‌ల్లోని ప‌దును చూసిన వారంతా.. ఏపీ త‌మ్ముళ్ల‌లో విష‌యం ఉందే అనుకునే ప‌రిస్థితి. అంటే.. ఏపీ నేత‌లు మాట్లాడ‌గ‌ల‌ర‌న్న మాట‌. కాకుంటే.. వారి నోటికి ప‌ని చెప్పాలంటూ అధినేత నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు అందితే చాలు చెల‌రేగిపోతారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రియాక్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు.
 
ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో హ్యాండ్ ఇచ్చిన మోడీ స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్న త‌మ్ముళ్ల స్పీడ్‌ కు బ్రేకులు వేసిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ్ముళ్ల మాట‌ల మంట ఢిల్లీకి తాకింద‌ని.. డోస్ ఎక్కువైతే లెక్క‌లో తేడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న విష‌యాన్ని పార్టీ ముఖ్య నేత‌ల‌కు చెప్పి.. ఆ విష‌యాన్ని త‌మ్ముళ్ల‌కు చేర‌వేయాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం ముఖ్య‌నేత‌ల‌తో భేటీ అయిన బాబు.. బీజేపీ మీద విమ‌ర్శ‌ల డోసు త‌గ్గించాల‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ మీద ఫోక‌స్ పెంచాల‌ని.. వారు విభ‌జ‌న చ‌ట్టంలో హోదా విష‌యం పెడితే బాగుండేద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇలాంటిదేమీ లేద‌ని తెలుగు త‌మ్ముళ్లు కొట్టిపారేస్తున్న నేప‌థ్యంలో.. త‌మ్ముళ్లు ఎంత‌గా చెల‌రేగిపోతార‌న్నది చూడ‌టం ద్వారా బాబులు బ్రేకులు వేశారో లేదా తెలుస్తుంద‌ని చెబుతున్నారు. సో.. కాసిన్ని రోజులు గ‌డిస్తే స‌రిపోతుందేమో..!
Tags:    

Similar News