విభజన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఆయన తీరు చూస్తే.. మూడు ముహుర్తాలు.. ఆరు పూజల మాదిరిగా మారింది. కట్టుబట్టలతో ఏపీకి వెళ్లాల్సిన వేళ.. రాజధాని మొదలు పరిపాలనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కొత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి. దీనికి తోడు.. నమ్మకాల డోసు ఎక్కువగా ఉండే చంద్రబాబు ప్రతి పనికి ముహుర్తాలు నిర్ణయించటం.. పూజలు చేయిస్తున్నారు. తరచూ ఈ తరహా కార్యక్రమాల్లో బాబు కనిపించటం ఈ మధ్య ఒక రివాజుగా మారింది.
హైదరాబాద్ నుంచి ఏపీకి సర్కారు షిఫ్ట్ కావటం.. రాజధాని అమరావతి.. తాత్కాలిక సచివాలయం.. ఇలా ప్రతి విషయానికి ముహుర్తాలు పెట్టుకొని పూజలు చేయిస్తున్నారు. తాజాగా వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సీఎం ఛాంబర్ ను ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహుర్తం వేళ.. సీఎం ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. ఛాంబర్ ప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇప్పటివరకూ సీఎంవో లేకుండా.. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సచివాలయ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయటం.. హైదరాబాద్ నుంచి ఏపీ ఉద్యోగులంతా వెలగపూడికి షిఫ్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎంవో కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి మొదలు.. సాధారణ ఉద్యోగి వరకూ అందరూ వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి పని చేయటం మొదలైనట్లేనని చెప్పొచ్చు.