బెజ‌వాడలో బాబుకు నాలుగిళ్లు..!

Update: 2015-05-12 09:56 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ప‌రిస్థితి చాలా చిత్రంగా ఉంది. మామూలుగా రాష్ట్ర ముఖ్య‌మంత్రికి పాల‌న మీద దృష్టి పెడితే స‌రిపోతుంది. కానీ.. విభ‌జ‌న పుణ్య‌మా అని ఏ ముఖ్య‌మంత్రికి లేన‌న్ని చిత్ర‌మైన స‌మ‌స్య‌లు బాబును చుట్టుముడుతున్నాయి.
విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి రాజ‌ధాని లేని నేప‌థ్యంలో.. రాజ‌ధాని నిర్మాణం కోసం బాబు ప్ర‌య‌త్నాలు చేయ‌టం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ నుంచి ప‌ని చేయాల‌ని భావించ‌టం తెలిసిందే. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌దేళ్ల పాటు ఉండేందుకు ఏపీకి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ప్రాక్టిక‌ల్ గా ప‌లుఇబ్బందులు ఎదుర‌వుతున్న ప‌రిస్థితి. 
ఏపీ ముఖ్య‌మంత్రి వేరే రాష్ట్రం నుంచి పాలిస్తున్నార‌న్న విమ‌ర్శ బాబు ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు సైతం హైద‌రాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ని ప‌రిస్థితి.
ఈ నేప‌థ్యంలోముందు తానే విజ‌య‌వాడ‌లో త‌న అధికారిక కార్య‌క‌ల‌పాలు మొద‌లుపెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న త‌న‌కు అనువుగా ఉండే నివాసం చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీంతో.. చంద్ర‌బాబు ఉండేందుకు నాలుగు ఇళ్ల‌ను సిద్ధం చేశారు. మే 25 నాటికి ఏపీ సీఎం కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అధికారులు బాబుకు తెలిపారు. 
నాలుగిళ్ల‌తో పాటు.. క్యాంప్‌కార్యాల‌యాన్ని వాస్తునిపుణులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు చెబుతున్నారు. జూన్ రెండో వారం నుంచి వారంలో మూడు రోజుల పాటు బాబు.. బెజ‌వాడ నుంచే అధికారిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌ర్తించ‌నున్న విష‌యం తెలిసిందే
Tags:    

Similar News