ఇంత సీరియస్ మేటర్లోనూ బాబు సీనియారిటీ గోల

Update: 2018-03-08 04:15 GMT
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారు.. ఎన్డీయే నుంచి బయటకొచ్చేస్తారా.. లేదంటే కేంద్రమే దారికొస్తుందా అని రెండు రోజులుగా ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఉణ్నారు. ఇలాంటి సమయంలో బుధవారం రాత్రి చంద్రబాబు పాక్షికంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. పార్టీగా ఎన్డీయే నుంచి బయటకు రాలేదు కానీ మోదీ ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు బయటకు వచ్చేయనున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చంద్రబాబు పార్టీ నేతలతో సుదీర్ఘంగా సంభాషించారు. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి సుజనా - అశోక్ రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుతూ అందరిలో ప్రత్యేక హోదా సెంటిమెంటు రగిలేలా చేసిన ఆయన సందట్లో సడేమియాలా ఎప్పట్లా తన స్వోత్కర్ష మొదలుపెట్టారు. దేశంలో తనను మించిన సీనియర్ లీడర్ లేరని ఆయన అన్నారు.
    
తనకు ఎవరితోనూ ఇగోలు లేవని.. రాష్ట్రప్రయోజనాలు తప్ప తనకింకేమీ ముఖ్యం కాదని చంద్రబాబు అన్నారు. నిజానికి సమకాలీన రాజకీయాల్లో దేశంలోనే తన కంటే సీనియర్ ఎవరూ లేరని ఆయన చెప్పారు. తాను 9 సంవత్సరాలు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నానని.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని.. అందరూ తనకంటే జూనియర్లేనని అన్నారు.
    
కాగా రాష్ట్రం ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఈ సీనియారిటీ గొడవేంటో అన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ అప్పుడే సెటైర్లు మొదలయిపోయాయి.




Tags:    

Similar News