జూబ్లీహిల్స్ ఇంటిని బాబు ఎందుకు ఖాళీ చేస్తున్నట్లు?

Update: 2016-02-24 04:29 GMT
సొంతిల్లు పాతదై.. ఇరుకైపోతుందని.. దాని స్థానే కొత్త ఇళ్లు కట్టించే ఉద్దేశ్యంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లోని సొంతింటిని ఖాళీ చేయటం తెలిసిందే. కొత్తగా ఇంటిని కట్టే సమయంలో అద్దె ఇంట్లోకి ఆ మధ్య మారారు. ఇందుకోసం.. భారీగానే ఖర్చు చేశారు. పేరుకు అద్దె ఇల్లే అయినా.. ఏపీ ముఖ్యమంత్రి బస చేయటం అంటే మాటలు కాదు కదా. అందుకే.. తమ అవసరాలకు తగ్గట్లుగా అద్దె ఇంటిని అందంగా అలంకరించటంతో పాటు.. కొన్ని అదనపు సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కోట్ల రూపాయిల ఖర్చు చేసిన ఆ ఇంటిని బాబు ఫ్యామిలీ తాజాగా ఖాళీ చేయటం గమనార్హం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 25 లోని సదరు ఇంటిని ఖాళీ చేస్తున్న బాబు ఫ్యామిలీ.. మదీనాగూడలోని ఫాంహౌస్ కి ఫ్యామిలీని షిఫ్ట్ చేయించటం గమనార్హం. ఎందుకిలా..? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. అద్దెఇంట్లో వాస్తు సరిగా లేదని.. ఆ ఇంటిని అర్జెంట్ గా ఖాళీ చేయాలని వాస్తు పండితులు హెచ్చరించారని.. ఈ నేపథ్యంలో హడావుడిగా అద్దె ఇంటిని ఖాళీ చేసి.. ఫాంహౌస్ కి షిఫ్ట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ ఈ మాటే నిజమైతే.. అద్దె ఇంట్లోకి చేరే ముందే.. అవసరమైనంత మంది వాస్తు పండితులకు ఇంటిని చూపించి.. ఓకే చేయించుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తు ఇష్యూ కారణంగా ఇంటిని అకస్మాత్తుగా ఖాళీ చేయించటం కారణంగా బాబు ఫ్యామిలీకి కలిగే ఇబ్బందితో పాటు.. అద్దె ఇంట్లో సౌకర్యాల కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయిలు బూడిదలో పోసిన పన్నీరే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News