ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు అధికారులకు ఆర్థిక పాఠాలు చెప్పారు. తన కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఆఖరి మైలురాయి వరకు అందే ప్రతి రూపాయి కూడా లెక్కల్లో కనిపించాలని ఆదేశించారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో సింగపూర్ తరహా విధానాన్ని అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. సొంత ఆర్థిక వనరులతో పాటు బయటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి సింగపూర్ ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని చంద్రబాబు తెలిపారు. బలమున్న రంగాల్లో బయటి రాష్ట్రాలకు సేవలందించడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకున్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లామ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్థిక వ్యవహారాలన్నీ ఇప్పటికే డిజిటలైజ్ చేశామని కల్లామ్ వివరించారు. ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తిగా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నామని, ఎక్కడా మానవ సహిత లావాదేవీలు లేవని చెప్పారు. అయితే ట్రెజరీ-బ్యాంకులు- ఆర్బిఐ మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అక్టోబర్ మాసంతో పోల్చితే నవంబరులో రాష్ట్ర సొంత వనరుల ఆదాయం రూ.200 కోట్లు తగ్గిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటివరకు వున్న అన్ని బిల్లులను క్లియర్ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. నీరు-చెట్టు వంటి కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ యేతర కేటాయింపులకు సంబంధించిన బిల్లుల్ని క్లియర్ చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు నాబార్డు నుంచి త్వరలో అందనున్నాయని, అవి వస్తే కొంత ఆర్థిక వెసులుబాటు వుంటుందని అధికారులు వివరించారు.
మున్సిపల్-ఆర్ అండ్ బీ- జలవనరుల శాఖలకు సంబంధించి బడ్జెట్ యేతర ఖర్చుకు సంబంధించిన రూ.1400 కోట్లు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిధుల వినియోగంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల గురించి సమావేశంలో సమీక్షించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సిఎఫ్ఎంఎస్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి కొన్ని వివరాలు అందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/