`ఇక మీ తప్పులను క్షమించేది లేదు. ఆశించినట్లు పనిచేయకపోతే అభ్యర్థులను మార్చేస్తా. సీనియర్లు అని కూడా చూడను!` ఇలాంటి కఠినమైన పదాలు తెలుగు నేలపై సహజంగా ఎవరి నుంచి వినిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి అనేది తెలిసిన సంగతే. పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు - టెలీకాన్ఫరెన్స్ ల సందర్భంగా బాబు ఇలా హెచ్చరించడం...మళ్లీ పార్టీ నేతలు దాన్ని లైట్ తీసుకోవడం...తిరిగి బాబు హెచ్చరించడం అన్నది చర్వితచరణంగా సాగుతున్నదనే భావన రాజకీయవర్గాల్లో ఉంది.
తాజాగా అదే రీతిలో మళ్లీ బాబు మార్క్ పాత బెదిరింపు వినిపించింది. పనిచేయని ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా మార్చేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పనితీరు ఆధారంగానే ఏ - బీ - సీ - డీ గ్రేడింగులు చేస్తున్నామని, టికెట్లు కూడా వాటి ఆధారంగానే ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు - నాయకులతో బాబు జరిపిన వీడియోకాన్ఫరెన్సులో ఎమ్మెల్యేలు - నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీ తప్పులను క్షమించేది లేదు. ఆశించినట్లు పనిచేయకపోతే అభ్యర్థులను మార్చేస్తానని హెచ్చరించారు. గోదావరి జిల్లాల నేతలను కోడిపందేలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీ పనితీరు విమర్శలకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఏ - బీ - సీ - డీ గ్రేడింగులు ఇస్తామని, దాని ప్రాతిపదికగానే టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎప్పట్లాగే రాబోయే ఎన్నికల గురించి హితబోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో గెలిచితీరాల్సిందేనని, అందుకోసం తనకు గెలుపుగుర్రాలనే ప్రోత్సహిస్తానని నిర్మొహమాటంగా చంద్రబాబు చెప్పారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రులు - పార్టీ ఇన్చార్జుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొత్త విధానాలు అనుసరించాలన్నారు. 2018 చివర నాటికి జిల్లా - నియోజకవర్గాల్లో పార్టీకి సొంత భవనాలు ఉండాలని - స్థలం అందుబాటు వివరాలు సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ఇటీవలి విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన అవమానాన్ని నేతలు ప్రస్తావించగా, అలాంటి సున్నిత విషయాల్లో వాస్తవాలు సేకరించి, అందులో అబద్ధం ఉంటే సమష్టిగా వ్యవహరించి నిజాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఇటీవల రాష్టప్రతి జాతికి అంకితం చేసిన ఫైబర్ నెట్ - ఆర్టీజీపై దేశవ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను ప్రస్తావించారు.