మూడు రాజధానులపై టీడీపీ నయా ప్లాన్ ..ఏమిటంటే !

Update: 2020-01-18 10:07 GMT
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో ఉంది. మూడు రాజధానుల విషయంలో వైసీపీ - టీడీపీ మధ్య విమర్శల యుద్ధం జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం అని వైసీపీ అంటుంటే ..టీడీపీ మాత్రం అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ అమరావతి రైతులకి మద్దతుగా నిలుస్తుంది. కానీ, పరిపాలనా  రాజధానిని విశాఖకు తరలించడానికి ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే  సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ తరువాత రోజునే రాజధాని మార్పు బిల్లు  శాసన మండలిలోనూ ఆమోదం పొందాలనేది ప్రభుత్వం వ్యూహం. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సైతం ప్రతివ్యూహాలను సిద్దం చేస్తోంది.

అందులో భాగంగా..తొలి సారిగా సభ్యులకు విప్ జారీ చేస్తోంది. పార్టీ నుండి దూరమై - అధికార పార్టీకి దగ్గరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని నిర్ణయించారు. ఇక మండలిలో టీడీపీ కీలక భూమిక పోషించనుంది. దీని పైన పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు  ముఖ్య నేతలతో ఆదివారం కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వం సభలో సీఆర్డీఏ బిల్లు సవరణ రద్దు, మూడు రాజధానుల అంశం పైన తీర్మానం..వంటి వాటిల్లో ఏ రూపంలో సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉందనే దాని పైన టీడీపీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఏ రూపంలో బిల్లు సభ ముందుకు వచ్చినా ఏ రకంగా ఎదుర్కోవాలనేది దాని పైన వ్యూహాలు సిద్దం చేస్తోంది.

పార్టీ నుండి గెలిచిన 23 మంది శాసన సభ్యులు తప్పని సరిగా అసెంబ్లీకి హాజరు కావాలంటూ టీడీపీ విప్ జారీ చేసింది. అందులో టీడీపీ నుండి దూరమై వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ, మద్దాలి గిరికి సైతం పార్టీ విప్ జారీ చేసింది. వారికి పార్టీ నుండి అధికారిక సమావేశం పంపారు. వారి వ్యక్తిగత మెయిల్ కు సందేశం..ఫోన్ కు మెసేజ్ తో పాటుగా వాట్సప్ సందేశం సైతం పంపుతున్నారు. ఇక, సీఆర్డీఏ చట్టం సవరణ, అమరావతికి చట్ట బద్దంగా ఉన్న హక్కులు.. ప్రభుత్వ ప్రతిపాదనల పైన న్యాయ పరంగా, సాంకేతికంగా ఏ రకంగా ఎదుర్కోవాలనే దాని పైన న్యాయ నిపుణుల సలహాలను సైతం టీడీపీ సేకరిస్తోంది. అయితే అసెంబ్లీ లో తమకి సరైన మద్దతు లేకపోయినా కూడా ఆ ఇద్దరూ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చు అని భావిస్తుంది. ఇదే సమయంలో విశాఖ నుండి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఏంటనేది కీలకంగా మారుతోంది. వారు టీడీపీకి మద్దతు తెలుపుతారా ..లేక టీడీపీ మద్దతు గా ఉంటూనే ..మూడు రాజధానులకి జై కొడతారో చూడాలి.

ఇక, ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మండలి సభ్యుల పాత్ర కీలకం కానుంది. అధికార వైసీపీకి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ బిల్లు ఈజీగా పాస్ అయిపోయితుంది. ఇందు కోసం 21వ తేదీన శాసన మండలి సమావేశానికి నోటిఫికేషన్ జారీ చేసారు. మండలిలో టీడీపీకి ప్రస్తుతం 28 మంది సభ్యుల మద్దతు ఉంది. అదే విధంగా బీజేపీ నుండి ఇద్దరు సభ్యులు ఉన్నారు. నామినేటెడ్ సభ్యుల్లోనూ కొందరు అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారు. దీంతో..అక్కడ తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ భావిస్తుంది.
Tags:    

Similar News