ఈ గ్రూఫ్ సెల్ఫీ ఇప్పుడు వాట్సాప్ లో హాట్ డిష్కషన్ గా మారింది. విమానంలో ప్రయాణిస్తూ ఈ ముగ్గురు నేతలూ తీసుకున్న ఈ ఫొటో వాట్సాప్ లో షేర్ అవుతూ ఉంది. ఈ ముగ్గురు నేతలూ ఢిల్లీలో సీక్రెట్ గా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారనేది ఈ వైరల్ టాక్ సారాంశం!
ఒకవైపు చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తీవ్రం అవుతున్నాయి. పార్టీ ఓడిపోవడం మాట అటుంచితే.. ఆఖరికి సొంత పార్టీ నేత చనిపోతే కూడా చంద్రబాబు మీదే విమర్శలు వచ్చాయి. మనుషులను వాడుకు వదిలేసే టైపు ఈయన .. అనే టాక్ జనాల్లోకి బలంగా వెళ్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఉన్న క్రెడిబులిటీ అంతంత మాత్రం. ఇలాంటి నేఫథ్యంలో.. కోడెల మరణించిన పరిస్థితులు చంద్రబాబు విశ్వసనీయతను మరింత దారుణంగా దెబ్బతీశాయి.
ఇక చంద్రబాబు నాయుడును ఎండగట్టడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు ఏవీ చేయకుండానే విజయవంతం అవుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోయింది. అయితే ఇంకా మూడు నెలలే గడిచాయి. ఇంకా చాలా కథ నడవాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడటంలో వింత ఏమీ లేదు.
ఈ నేపథ్యంలో తన పార్టీ ఎంపీలిద్దరినీ వెంట పెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లారని - అక్కడ బీజేపీ అధినాయకత్వంతో రహస్యంగా సమావేశం అయ్యారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలకు ఈ సెల్ఫీ ఊతం ఇస్తూ ఉంది. ఇంతకీ అసలు కథ ఏమిటో.. ఈ ముగ్గురులో ఎవరు స్పందించినా వారి వాదన వినిపించినట్టుగా అవుతుందని పరిశీలకులు అంటున్నారు.