దక్షిణాది పార్టీలన్నిటిని ఒక్క తాటిపైకి తీసుకుని వచ్చే ఆలోచనలో శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ పనిని సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు ఆయన అన్ని ప్రాంతీయ పార్టీలతోనూ జత కట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామితో ఇదే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా కుమారస్వామి అమ్మవారిని దర్శించుకుందుకు కుమార్ స్వామి విజయవాడ వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కుమారస్వామికి గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ ఎంపీ లగడపాటి - ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు - కలెక్టర్ లక్ష్మీ కాంతం సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత కుమార్ స్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ఇతర మంత్రులతో 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని - ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేసే అంశంపై ప్రాధమికంగా తమ మధ్య చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దక్షిణ భారతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయమై చర్చించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్‌స్వామితో మరో సారి భేటి అవుతానని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు నాయుడు తన సర్వశక్తులను ధార పోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నారా వారి హవా తగ్గిందని విశ్లేషకులు బాహాటంగానే చెప్తున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది కాని - ఒరగ పెట్టింది కాని ఏమి లేదని అంటున్నారు. . అంతేకాకుండా చిన్న బాబు నారా లోకేష్ కూడా బాబుకు కలసి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెరిగిందని చంద్రబాబు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోలేరు... కాంగ్రెస్ తో పొత్తుకు తమ పార్టీలోని నాయకులే తనకు ఎదురు తిరగుతున్నారు. దీంతో చేసేది లేక కొత్త రాజకీయం మొదలుపెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని ఓడించే మాట అటుంచి - రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా ఆలోచనలు చేయాలని పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం..