తనకు పిల్లనిచ్చిన మామ.. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎట్టకేలకు చంద్రబాబు బయటకు వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక మాట్లాడిన బాబు.. గత ఐదు రోజులుగా ఎవరికీ కనిపించకుండా మౌనంగా ఉండిపోయారు. ఎట్టకేలకు జయంతి సందర్భంగా మంగళవారం బయటకు వచ్చారు. టీడీపీ ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయానన్న బాధ ఆయన మోములో కనిపించింది. ఓటమి భారంతో కళ తప్పిన చంద్రబాబును టీడీపీ నేతలు చూడలేకపోయారు.
గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతిని మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాట్లు జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారన్న వార్తల నేపథ్యంలో ప్రసంగం మొదట్లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కృషి త్యాగాన్ని కొనియాడారు.
ఎన్నికలు.. సీఎంగా తీరికలేకుండా గడిపిన బాబు.. ఇప్పుడు మాత్రం బాగా నిద్రపోయి.. ముఖం ఉబ్బుగా కనిపించింది. అయితే ఆ ఓటమి బాధ మాత్రం ఆయన స్వరంలో.. ప్రసంగంలో కనిపించింది. గంభీరమైన చంద్రబాబు వాయిస్ ఈ ప్రసంగంలో మూగబోయింది. జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ను కీర్తిస్తూ అదే రోటీన్ ను కాస్త టోన్ డౌన్ తో చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే ఓటమితో కృంగిపోనని..ఎన్టీఆర్ లాంటి మహానుభావుడే ఓడిపోయాడని చంద్రబాబును కార్యకర్తలు, నేతలకు దైర్యం నూరిపోశారు. తాను ఐదురోజులుగా టీడీపీ నేతలు,కార్యకర్తలను కలుస్తున్నానని.. ఓటమిపై విశ్లేషిస్తున్నానని.. వారంతా బాధపడ్డారని బాబు చెప్పుకొచ్చాడు.
తాను కుటుంబానికి దూరంగా.. కుటుంబానికి కంటే ఎక్కువగా పార్టీని, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని పాలించానని.. సంక్షేమ పథకాలను అందిచానని.. ఓటమిపై కారణాలను అన్వేషిస్తానని బాబు చెప్పుకొచ్చారు. ఇక నుంచి తాను గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మూడు గంటలు ప్రతిరోజు ఉంటానని.. ఓటమిపై విశ్లేషించి మరింత ధాటిగా ముందుకు వెళదామని టీడీపీ నేతలకు హితబోధ చేశారు.