లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి తన ఫుల్ ఫోకస్ జాతీయ రాజకీయాలేనని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి కరీంనగర్ లో జరిగిన సభలో మాట్లాడిన కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను చూసి భయపడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తో ఏమీ కాదని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రాలో ఆయనను ఓడిస్తానని భయపడుతున్నాడని అన్నారు. మూడు నెలల్లో తనను మూడు వేల సార్లు తిట్టాడని బాబుపై ఫైర్ అయ్యారు. 20 ఏళ్ల క్రితం తాను తెలంగాణ తెస్తానని అంటే బాబు తీసిపారేశాడని.. ఇప్పుడు మాత్రం నా ఉనికికే కంగారు పడుతున్నాడని గుర్తు చేసుకున్నారు.
*తెలంగాణ దరిద్రం వదిలించా..
దారితెన్ను లేని రాష్ట్రాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ అన్నారు.. విద్యుత్ రంగంలో అద్భుతాలు ఆవిష్కరించామని.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నాలుగు జీవధారలు తెలంగాణకు దక్కుతాయని తెలిపారు. పరిపాలన చేతకాదు అన్న వారికే పరిపాలన నేర్పుతున్నామన్నారు.
*రాహుల్, మోడీపై ఫైర్
తెలంగాణను కేవలం ఇద్దరు ఎంపీలతో సాధించానని.. ఇప్పుడు 16 ఎంపీలను ఇస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్ అన్నారు. 16 ఎంపీలతో ఏం చేస్తారన్న మాటలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తన వెంట 120 మంది వరకు ఎంపీలు , పార్టీలు లైన్లో ఉన్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉంటే.. 40వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్కటైనా ఉందా అని మోడీ, రాహుల్ ను ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇచ్చే విషయంపై అమిత్ షా అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఇన్నేళ్లు పాలించినా ఇక తాగునీళ్లు, సాగునీళ్లు లేవని దుయ్యబట్టారు. 15 ఏళ్లుగా కృష్ణా జిల్లాల వివాదాన్ని పరిష్కరించలేదన్నారు. అందుకే అవసరమైతే జాతీయ పార్టీని పెట్టి దేశ రాజకీయాలను మార్చేస్తానని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.