షర్మిలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2021-03-04 14:20 GMT
తెలంగాణలో రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత ఆరోపించారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రోడ్ షోలో జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఒక పిరికిపంద అంటూ మండిపడ్డారు. జగన్ కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

ఏం చేశారని జగన్ కు ఓటేస్తారని.. ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు విమర్శించారు. అమ్మఒడి పథకంపై చంద్రబాబు విమర్శించారు. ఓ పక్క లాక్కుంటూ మరో పక్క పంచుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెంచి పీల్చేస్తున్నారని.. వాటినే ప్రజలకు పంచుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కర్నూలు నగరంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
Tags:    

Similar News