టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలుకు వెళ్లారు. ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజులు ఆయన అక్కడే ఉంటారు. అయితే..ఈ సందర్భంగా ఉమ్మ డి జిల్లాలో ఆయన ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలపై ప్రధానంగా దీష్టి పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు ఇది అమృత కాలమనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు తమ్ముళ్లను రెడీ చేసుకోవడం..అంతర్గత సమస్యలను వివాదాలను పరిష్కరిం చుకోవడం వంటి కీలక అంశాలపై ఆయన దృష్టి సారిస్తారని అనుకున్నారు.
కానీ, చంద్రబాబు మాత్రం లోకల్ సమస్యలకు బదులుగా.. రోడ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక, కర్నూలు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఇంతటితో జిల్లాలో చంద్రబాబు పర్యటన ముగియనుంది. ఇదిలావుంటే..వాస్తవానికి జిల్లాలో రాజకీయ పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదనే విషయం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహం ఎలా ఉన్నా.. ఇక్కడ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి.
2014లో పార్టీ గెలిచినప్పుడే జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లలో కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచింది. కర్నూలు, నంద్యాల రెండు ఎంపీ సీట్లలోనూ ఓడింది. అసలు కర్నూలు, నంద్యాల ఎంపీ సీట్లలో టీడీపీ చివరిసారిగా 1999లో మాత్రమే గెలిచింది. అంటే జిల్లాలో ఎంపీ సీట్లలో టీడీపీ జెండా ఎగిరి 20 ఏళ్లు దాటిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసేసింది. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ, పాణ్యం, శ్రీశైలం.. వంటి నియోజకవర్గాల్లో తమ్ముళ్లు అసలు యాక్టివ్‌గా లేరనేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట.
ఇక్కడ పార్టీని సంస్కరించాలని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకుచంద్రబాబు కొందరితోనే మాట్లాడారు. కీలకమైన భూమా అఖిల ప్రియ కానీ, ఆ కుటుంబ సభ్యులతో కానీ,ఆయన చర్చించలేదు.
సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడంలోనూ ఆయన ఇప్పటికీ చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు జిల్లా పర్యటనలో అయినా..ఇ క్కడ పార్టీని బలోపేతం చేస్తారో లేదో.. చూడాలి. ఇప్పటి వరకు అయితే.. చంద్రబాబు పర్యటన కేవలం రోడ్ షోలు, బహిరంగ సభలకే పరిమితం కావడం గమనార్హం. మరి ఏమైనా స్థానిక పరిస్థితులపై దృష్టిపెట్టి మార్పులు తీసుకువస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.