విజయవాడ-విశాఖ-గుంటూరు- ఇలా.. ఎటు నుంచి తిరుపతి వైపు వెళ్లాలన్నా.. అడుగడుగునా.. చెక్ పోస్టులు.. ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు.. నిలువరింతలు.. ఆధార్ కార్డు పరిశీలనలు.. ఇదీ.. ఈ రోజు ఉదయం నుంచి విజయవాడ-తిరుపతి జాతీయ రహదారిపై ఏపీ పోలీసులు చేస్తున్న విధి నిర్వహణ. అంతేకాదు.. ఈ దారిలో వెళ్తున్న ప్రతి వెహికల్‌ను వారు ఆపుతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎవరికోసం వెళ్తున్నారనే ఆరా చేస్తున్నారు. సీనియర్ అధికారుల నుంచి కానిస్టేబల్ వరకు అందరూ జాతీయ రహదారిపై చేరుకున్నారు.
దీనికి కారణం.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆయన తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలోనూ పర్యటిం చనున్నట్టు తెలుస్తోంది. అయితే.. షెడ్యూల్‌లో మాత్రం తిరుపతి పర్యటన అని మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి బయలు దేరి.. మధ్యాహ్నం తర్వాత.. తిరుపతికి చేరుకునేందుకు బయలు దేరారు.
అయితే.. చంద్రబాబు తిరుపతికి వస్తున్నందన.. ఆయన సంఘీభావంగా.. రాష్ట్రంలోని పార్టీ నాయకులు, శ్రేణులు తిరుపతి వెళ్తారేమోనని.. పోలీసులు ఉలిక్కి పడ్డారని.. టీడీపీ నాయకులు అంటున్నారు.
ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై కాపు కాచారని..అంటున్నారు. తిరుపతి వైపు వెళ్తున్న వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేతలను నిలువరించడంతోపాటు.. చంద్రబాబు పర్యటనకు వెళ్తే.. కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నట్టు నాయకులు తెలిపారు.
అయితే.. ఇంత ఉలుకుపాటు ఎందుకు? అనేది టీడీపీ నేతల ప్రశ్న. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక జగన్ నియంతృత్వంలో ఉన్నామా.. అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒక దేశ సరిహద్దు దాటేందుకు కూడా ఇన్ని తనిఖీలు ఉండవని.. సొంత రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు .. ఎందుకు తనిఖీలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాద హెచ్చరికలు జారీ చేశారా? అని నిలదీస్తున్నారు.చంద్రబాబును చూసి అంత వణుకు ఎందుకని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.