ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పటికే లోకేష్ బాబు ఇంట గెలవక.. రచ్చ గెలవక అభాసుపాలైన సంగతి మొన్నటి ఎన్నికల వేళ చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి తనకు ఎదురుకాకూడదని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడు తన సొంత నియోజక వర్గం ‘కుప్పం’ భయం పట్టుకుందట..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా అంతికష్టం మీద గెలిచాడు. రెండు రౌండ్ల లో వైసీపీ అభ్యర్థి కంటే వెనుక బడ్డాడు. కుప్పం లో చంద్రబాబు ఇలా వెనుకబడడం ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే ప్రథమమట.. ఎప్పుడూ వేల మెజార్టీతో గెలిచే బాబును దాదాపు ఓడించినంత పనిచేశాడు వైసీపీ అభ్యర్థి. బాబు కు తగ్గిన మెజార్టీ తో ఇప్పుడు ఆయన కుప్పంలో ప్రక్షాళన చేయడానికి రెడీ అయ్యారట..
మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గ సమీక్ష చేసిన చంద్రబాబు అక్కడ తన తరుఫున నియమించిన నేతలు ప్రజలతో సంబంధం లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పంలో స్థానిక నాయకుల లో ఎక్కువ మంది చంద్రబాబు బాల్య స్నేహితులే ఉన్నారు. చంద్రబాబుతో ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నారు. 35 ఏళ్లుగా బాబుతో కలిసి నడుస్తున్నారు. కానీ ఇప్పుడు వారంతా ఓటర్ల తో సంబంధాన్ని కోల్పోతున్నారని, నిర్లక్ష్యం గా ఉంటున్నారని.. ప్రజలను పట్టించుకోవడం లేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. కుప్పం తెలుగు దేశం పార్టీలో కొత్త రక్తాన్ని తీసుకు రావడం గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నాడట.. తద్వారా వారు కష్టపడి పని చేస్తారని బాబు భావిస్తున్నాడట...
కాగా కుప్పం లో తెలుగుదేశం సీనియర్ నాయకులను మార్చాలని చంద్రబాబు నిర్ణయించడంపై వారంతా తీవ్ర నిరాశ కు గురయ్యారని తెలిసింది. చంద్రబాబు తో సమానంగా ఇన్నాల్లు రాజకీయం గా చేసిన వారిని ఇప్పుడు వద్దనుకుంటున్నాడని.. బాబు కూడా ప్రజల తో సంబంధాన్ని కోల్పోయాడని.. అతన్ని కూడా మార్చాలని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారట..
వైసీపీ ఇప్పటికే కుప్పం నియోజకవర్గం పై దృష్టి సారించింది. చంద్రబాబు ను వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి ప్లాన్ చేస్తోంది. దీంతో చంద్రబాబు తన నియోజక వర్గం లో టీడీపీ నేతలను మార్చడానికి రెడీ అయ్యారట.. మరి కుప్పం లో వచ్చేసారి ఏం జరగబోతోందన్నది వేచిచూడాలి.