బాబు డైలీ మెనూ ఇలా ఉంటుంద‌ట‌!

Update: 2017-09-23 05:27 GMT
నిత్యం బిజీబిజీగా ఉంటూ తీరిక లేకుండా గ‌డిపే ప్ర‌ముఖుల ఆహార అల‌వాట్లు ఎలా ఉంటాయి?  వారేం తింటార‌న్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. రోటీన్ కు భిన్నంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని మీడియాతో పంచుకున్నారు. రోజూ తాను తీసుకునే ఆహారం ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని వివ‌రంగా చెప్పుకొచ్చారు.

ఉద‌యం టిఫిన్ కింద జొన్న ఇడ్లీ.. ఓట్స్ తో చేసిన ఉప్మా లేదంటే ఒక దోశ తింటాన‌ని.. ఒక పండు త‌ప్ప‌నిస‌రి అని చెప్పారు.

మ‌ధ్యాహ్నం రాగి జావ‌.. పుల్కా.. రెండు మూడు ర‌కాల కూర‌గాయ‌లు ఉంటాయ‌న్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో డ్రైప్రూట్స్ తింటాన‌ని.. సాయంత్రం ఆరున్న‌ర.. ఏడు గంట‌ల వేళ‌లో సూప్ తో పాటు ఉడికించిన రెండు గుడ్లు తీసుకుంటాన‌న్నారు. అయితే.. గుడ్డులో ఉండే ప‌చ్చ సొన‌ను తీసేస్తాన‌ని చెప్పారు.

రాత్రి ప‌డుకునే ముందు గ్లాసు పాలు తీసుకుంటాన‌ని చెప్పారు. రోజుకు ఐదారు గంట‌లు నిద్ర పోతాన‌ని.. రాత్రిళ్లు ఆల‌స్యంగా నిద్ర పోతే ఉద‌యం కాస్త ఆల‌స్యంగా నిద్ర లేస్తాన‌ని చెప్పారు. ఉద‌యం లేచిన త‌ర్వాత విజువ‌లైజింగ్ ధ్యాన ప్ర‌క్రియ చేస్తాన‌ని.. ఐదు నిమిషాలు నేను ఎవ‌రు.. ఎక్క‌డి నుంచి వ‌చ్చాను.. ఇప్పుడేంటి? అన్న‌ది అవ‌లోక‌నం చేసుకొని.. ఓ అర‌గంట శ్వాస వ్యాయామం చేస్తాన‌న్నారు. తాను పుడ్డీని కాద‌ని.. తినాలి కాబ‌ట్టే తింటాన‌ని.. కాకుంటే గ‌తానికి భిన్నంగా టైంకి తిన‌టం అన్న అల‌వాటును చేసుకున్న‌ట్లు చెప్పారు.

ఇటీవ‌ల హెరిటేజ్ సంస్థ స‌మావేశం సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి చేసిన ప్ర‌సంగానికి నెటిజ‌న్ల నుంచి సానుకూల స్పంద‌న రావ‌టాన్ని విలేక‌రులు ప్ర‌స్తావించి.. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న ప్ర‌శ్న‌కు.. అలాంటి అవ‌కాశ‌మే లేద‌ని.. భువ‌నేశ్వ‌రికి రాజకీయాలంటే ఆస‌క్తి లేద‌ని.. హెరిటేజ్ అంటేనే ఇష్ట‌మ‌ని బాబు చెప్పారు.
Tags:    

Similar News