అసెంబ్లీలో మార్మోగిన ‘చంద్రన్న భజన పాట’..జగన్ నవ్వులే నవ్వులు

Update: 2020-12-02 13:59 GMT
ఏపీ అసెంబ్లీ సాక్షిగా నవ్వులు పూశాయి. సీఎం జగన్ అంత అసెంబ్లీ వేడిలో ‘జయము జయము చంద్రన్న’ అనే చంద్రబాబు భజన పాట ప్రదర్శించి సభ మొత్తం నవ్వులు పూయించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన వారు చంద్రబాబుపై పాడిన భజన పాట వీడియోను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు. అందులో పోలవరం సందర్శన వచ్చిన కొంత మంది టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని భజన చేశారు.

ఈ వీడియో చూసి సీఎం జగన్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో పాటు మిగిలిన సభ్యులు పడి పడి నవ్వారు. ఈ పాట చూస్తూ నవ్వి నవ్వి అలిసిపోయిన సీఎం జగన్‌, చివరికి మధ్యలోనే ఆ వీడియోను ఆపివేయించారు.

ఈ వీడియో చూసిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇలా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని విమర్శించారు. ఇక వీడియో చూసిన స్పీకర్‌ తమ్మినేని.. అప్పట్లో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగాయన్న సంగతి నాకు తెలియదు అంటూ ఘొల్లున నవ్వారు. సీఎం జగన్ అయితే నవ్వి నవ్వి అలిసిపోయారు. ఆ వీడియో తర్వాత సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. పోలవరం సందర్శన పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రన్న భజన’ కోసం ఏకంగా రూ.83 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారని జగన్ సభలో ఆధారాలు చూపించి ఎండగట్టారు.


Tags:    

Similar News