దేశ ప్రజలంతా భావోద్వేగానికి గురి కావటమే కాదు.. గర్వ పడిన ప్రయోగంగా చంద్రయాన్2ను చెప్పాలి. వివిధ దశల్లో విజయవంతంగా సాగిన సదరు ప్రయోగం.. ఆఖరి క్షణాల్లో మాత్రం అనుకోని రీతిలో విక్రమ్ ల్యాండర్ పల్టీ కొట్టటంతో నిరాశకు గురి కావటం తెలిసిందే. అయితే.. చివరి క్షణం వరకూ అనుకున్నది అనుకున్న విధంగా సాగిన ప్రయోగంపైనా.. దాన్ని లీడ్ చేసిన ఇస్రో మీదా ప్రశంసల వర్షం కురిసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో చంద్రయాన్ 2 ఖర్చు వివరాలతో పాటు.. తయారీ వివరాలు వెల్లడించాల్సిందిగా కోరటంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇందుకు సమాధానం ఇచ్చారు. జీఎస్ఎల్ వీ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపగా.. ఐదుసార్లు కక్ష్యను పెంచారు.
సెప్టెంబరు ఏడున సాఫ్ట్ ల్యాండింగ్ లో భాగంగా విక్రమ్ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపు వెళ్లే సమయంలో కేవలం 500 మీటర్ల దూరంలో ల్యాండర్ లో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.978 కోట్లు ఖర్చు అయినట్లుగా ప్రకటించారు. దేశ ఔనత్యాన్ని మరింత పెంచేలా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించినట్లుగా పేర్కొన్నారు.