తుని ఎపిసోడ్ మీద ఛానల్ ఎండీ ఏంచెప్పారు?

Update: 2016-09-20 04:36 GMT
ఆ మధ్యన తునిలో ఏర్పాటు చేసిన కాపు గర్జనకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని ఒక ఛానల్ ఎండీ సీఐడీకి చెప్పినట్లుగా చెబుతున్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో విధ్వంసం చోటు చేసుకోవటం.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగలబెట్టటం దగ్గర నుంచి తుని పట్టణంలో చోటు చేసుకున్న విధ్వంసం వెనుక కుట్ర ఉందన్న సందేహం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తుని ఘటనకు సంబంధం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్న పలువురు అనుమానితుల్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఒక ఛానల్ ఎండీని విచారణకు పిలిచిన సీఐడీ.. ఈ సందర్భంగా సదరు ఎండీ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా చెబుతున్నారు.

సీఐడీ అధికారులు నిర్వహించిన విచారణకు సంబంధించిన అంశాలు అధికారికంగా బయటకు రాకున్నా.. విశ్వసనీయ వర్గాలు.. ఇతర మీడియాలలో వస్తున్న సమాచారాన్ని  చూస్తే.. తుని విధ్వంసానికి సంబందించిన కీలక సమాచారాన్ని సదరు ఛానల్ ఎండీ బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. విచారణలో సదరు ఛానల్ ఎండీ ప్రస్తావించినట్లుగా పలు మాటల్ని చెబుతున్నారు. ఇలా బయటకు వచ్చిన సమాచారం ఏదీ అధికారికం కాకపోవటం గమనార్హం. ‘‘తెలిసింది’’.. ‘‘చెబుతున్నారు’’.. ‘‘అనుకుంటున్నారు’’.. ‘‘సమాచారం’’ లాంటి మాటలు వినిపిస్తున్నయి. విచారణ సందర్భంగా అధికారులకు సదరు ఛానల్ ఎండీ చెప్పారని చెబుతున్న అనధికార మాటల్ని చూస్తే..

= తునిలో నిర్వహించిన కాపుగర్జనకు ఆర్థికంగా హైదరాబాద్ నుంచే సహకారంఅందింది (?)

= కాపు గర్జన సభకు ముందు హైదరాబాద్ లో ముద్రగడ పద్మనాభం నన్నుమద్దతు కోరారు. మీడియా పరంగా నేను సహకారం అందించా (?)

= సభ సందర్భంగా అక్కడ వాడిన డ్రోన్ కెమేరాలను ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారు. వాటిని సైతం హైదరాబాద్ లోనే కొనుగోలు చేశారు (?)

= కాపుగర్జనకు మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకరరెడ్డి ఏం సాయం చేశారోతెలీదు (?)

= కాపుల కోసం ఉద్యమం అంటే నేను వెళ్లా. ఒక్కొక్కరుగా మాట్లాడదామనికాపు నేతల్ని ఆహ్వానించిన పద్మనాభం.. పట్టాలపైకి రావాలంటూ అక్కడికివచ్చిన వారికి ఒక్కసారిగా పిలుపునివ్వటంతో అందరం ఆశ్చర్యపోయాం (?)

= యువకులను పద్మనాభం రెచ్చగొట్టటం వల్లే రైలు తగలబెట్టారు (?)..వాస్తవానికి వారికి అలాంటి ఉద్దేశం లేదు (?)

= ఈ గొడవ జరిగిన సమయంలో నాకు ప్రమాదం జరిగింది. కానీ.. ఎవరూ పరామర్శించటానికి రాలేదు (?)

= కేసుల్లో చుట్టుకున్న కాపులు పలువురు అనవసరంగా ఈ తలనొప్పి మనకు చుట్టుకుందని బాధ పడుతున్నారు (?)
Tags:    

Similar News