ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఓ పక్క 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు....ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అనడంలో ఎటువంటి సందేహం లేదని సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయం. టైం మెషీన్ లో ట్రావెల్ చేసినట్లు....గతంలోకి ట్రావెల్ చేసిన చంద్రబాబు ...ఎన్నో ఘనకీర్తులను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టడం..... ప్రముఖులెందరికో నోబెల్ - ఆస్కార్ లు ఇప్పించడం.....సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహాలు ఇవ్వడం - పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడం, పుట్టక ముందే నిజాంతో దోస్తీ చేసి బేగంపేట విమానాశ్రయాన్ని కట్టించడం...బ్రిటిష్ వారిపై పోరాడిన తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించడం...అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం.....పోలవరం డయాఫ్రమ్ వాల్ మొదలు గ్యాలరీ వరకు జాతికి అంకితమివ్వడం....ఈ తరహా ఘనతలన్నీ తన కీర్తి కిరీటంలో పెట్టుకోగల ఏకైక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నారావారి మ`హా`స్య కావ్యం గురించి రాయడానికి పేపర్లు సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా, మరో కామెడీ స్కిట్ తో చంద్రబాబు నెటిజన్ల ముందుకు వచ్చారు. ఇళ్లలో చెట్లు పెంచడం అనే రొటీన్ కాన్సెప్ట్ కాకుండా....చెట్ల మధ్యన ఇళ్లు ఉండేలా ప్రజలు చర్యలు తీసుకోవాలనే బృహత్తర కార్యక్రమానికి చంద్రబాబు పిలుపునిచ్చారు.
అదేదో సినిమాలో చెప్పినట్లు.....చప్పట్లతో సన్మానం చేస్తే వెరైటీగా ఉండదని...చిటికెలతో స్వాగతం పలుకుతారు. అదే తరహాలో చంద్రబాబు కూడా రొటీన్ కు భిన్నంగా ఆలోచించారు. సాధారణంగా ఇళ్ల మధ్యలో చెట్లు పెంచాలని పిలుపునిచ్చే ముఖ్యమంత్రులను చూశాం కానీ....చెట్ల మధ్యలోనే ఇళ్లు పెంచాలనే అద్భుతమైన కాన్సెప్ట్ బహుశా చంద్రబాబుకే సాధ్యం. తిరుపతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబుకు ఈ మెరుపులాంటి ఆలోచన తట్టింది. నేడు తిరుపతిలో పర్యటించిన బాబుగారు తన ప్రసంగంలో ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత గ్లోబల్ వార్మింగ్ వల్ల రాబోయే ఉపద్రవాన్ని`ముందు`చూపుతో గ్రహించిన బాబుగారు....పచ్చదనాన్ని పెంపొందించడానికి ఆ రకంగా `ముందు`కు పోవాలని పిలుపునిచ్చారు. కానీ, పచ్చగా ఉన్న అమరావతి ప్రాంతాన్నినాశనం చేస్తున్నారని...నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మొట్టికాయలు వేస్తున్న సంగతి బాబుగారు మరచిపోయినట్లున్నారు. ఎంతైనా వయసు మీదపడుతోంది కదా. ఏదిఏమైనా, ఇప్పటివరకు 40 ఈయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న నాయకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబుగారు...ఇకపై 30 ఈయర్స్ విజన్ ఉన్న విజనరీగా అంతకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా,....ఈ తరహాలో పర్యావరణ అసమతుల్యతను అంచనా వేయగల సత్తా గల సీఎం దొరకడం నిజంగా ఏపీ ప్రజల అదృష్టమనే చెప్పాలి. అదే నోటితో రాబోయే సునామీలు - వరదలు - భూకంపాలు - ఉపద్రవాలకు కూడా బాబుగారు పరిష్కారం చూపిస్తే బాగుండు...!