తూటాల్లాంటి మాటలు మాట్లాడుతూ.. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రాచీ మరోసారి చెలరేగిపోయారు. గతంలో హిందువులు కనీసం నలుగు పిల్లల్ని కనాలని చెప్పి కలకలం సృష్టించిన ఈ సన్యాసిని.. తర్వాత పదే పదే అదే మాటలను చెప్పటం తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మేం ఎంత మంది పిల్లల్ని కనాలో కూడా సాధువులు.. సన్యాసులే చెబుతారా? అంటూ కడిగేసిన వారున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై.. వందేమాతరం అని నినాదాలు చేయని వారికి భారతదేశంలో నివసించే హక్కు లేదన్నారు.
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సభలో మాట్లాడిన ఆమె.. ఈ సందర్భంగా అందరి చేత ఈ నినాదాలు చేయించారు. అంతేకాదు.. జాతయ పతాకాన్ని అవమానించే వారు.. గోవధకు పాల్పడేవారు కూడా దేశంలో నివసించే అవకాశం లేదంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
పనిలో పనిగా గతంలో నలుగుర్ని తక్కువ కాకుండా కనమన్న సాధ్వి ఈసారి మాత్రం.. ఇద్దరుకంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఓటుహక్కు లేకుండా చట్టం చేయాలని చెబుతున్నారు.ఏ మతానికైనా ఇదే చట్టం అనుసరించాలన్నారు.ఒకసారి నలుగురేసి పిల్లల్నికనమని..మరోసారి.. అలా కంటే ఓటుహక్కు ఉండదని చెప్పేయటం ఏమిటో సాధ్విఅమ్మగారికే తెలియాలి.