ఆవు పేడ సేకరణకు కొత్త పథకం ప్రారంభించబోతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం !

Update: 2020-07-15 17:00 GMT
ఛత్తీస్ ‌గఢ్‌ లో రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు గోధన్ నయా యోజన పేరుతో ఓ కొత్త పథకాన్ని ఛత్తీస్ ‌గఢ్ రాష్ట్ర సీఎం భూపేష్ బాగేల్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రోడ్లపై ఆవుల సంచారాన్ని తగ్గించడంతో పాటు పశువుల పెంపకాన్ని లాభదాయకంగా మార్చడానికి ఈ పథకం సహాయపడుతుందని సీఎం భూపేష్ బాగేల్ తెలిపారు. పశువుల యజమానుల నుంచి పేడను కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వం ఎరువుగా మార్చుతుంది అని తెలిపారు.

రైతులు, గోశాలల నుండి సేకరించిన ఆవు పేడను సహకార సంఘాల ద్వారా వర్మీకంపోస్టును తయారు చేసి రైతులకు కిలో 8 రూపాయల చొప్పున విక్రయించాలని ఛత్తీస్ ‌గఢ్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వర్మీకంపోస్టు తయారీకి సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్మీకంపోస్టు ఎరువును సహకార సంఘాల ద్వారా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టణాభివృద్ధి శాఖల ప్లాంటేషన్ కార్యక్రమాలకు, రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం భూపేష్ బాగేల్ వివరించారు.
Tags:    

Similar News