''ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. చిరంజీవి కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు జగన్ అరెస్టు అయ్యాడు. ''చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది'' అని వెంటనే కామెంట్ చేశాడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక. వైఎస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి. అలాంటి తండ్రి కొడుకులు అదే జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు. తమ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిందిగా ప్రార్ధించబోతున్నారు.
అదే కాల మహిమ అంటే.. థటిజ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.. టీమ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు'' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త్వరలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్న నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు ప్రచురితం అయ్యాయి. వీటిపై చెవిరెడ్డి స్పందించారు.
వాటిని పోస్టు చేసిన వారికి - తనకూ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి అంటే తనకు గౌరవాభిమానాలు ఎప్పుడూ ఉన్నాయన్నారు. చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను తుడా చైర్మన్ గా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు సత్సంబంధాలున్నాయన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు అలాంటి పోస్టులు పెట్టి చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెవిరెడ్డి ప్రకటించారు.