చీకటి సామ్రజ్యాన్ని ఏలిన ఛోటా రాజన్ ఆస్తుల గురించి వింటుంటే కష్టపడి కూడబెట్టుకుంటున్న వారంతా కళ్లు తేలేస్తున్నారట. ఛోటా రాజన్ ఆస్తుల విలువ దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ముంబయి పోలీసులకు తెలిసిన లెక్క మాత్రమే. రోజుకో దేశం తిరిగే ఈ డాన్ ఇంకా ఎక్కడెక్కడ ఎంతంత కూడబెట్టాడో పూర్తిగా కూపీ లాగితే ఆ మొత్తం 10 వేల కోట్లకు దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముంబయి పోలీసుల లెక్క ప్రకారం అతడి పెట్టుబడుల్లో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి. అందులోనూ అధికభాగం ముంబయిలోనే ఉన్నాయంటున్నారు. చైనాలో ఓ హోటల్ - సింగపూర్ - థాయ్ లాండ్ లలో కొన్ని నగల దుకాణాలు - జకార్తాలో ఓ హోటల్ కూడా ఉన్నాయట. ఆఫ్రికన్ దేశాల్లో - ముఖ్యంగా జింబాబ్వేలో ఛోటా రాజన్ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన తనను విడిచిపెడితే జింబాబ్వే వెళ్లిపోతానని చెప్పడానికి కూడా కారణం అదేనంటున్నారు.
భారతదేశంలో ఛోటా రాజన్ పై దాదాపు 75 కేసులు ఉన్నాయి. అందులో హత్య కేసులే 25. వీటిలో చాలా వరకు అత్యంత కఠినమైన 'మోకా' చట్టం కింద పెట్టినవే. దీంతో ఒక్కసారి ఇండియన్ పోలీసుల చేతిలో పడితే కేసు తరువాత కేసు లెక్కవేసి మూడేళ్ల వరకు కస్టడీలోనే ఉంచేసుకోవచ్చు. ఛోటారాజన్ కు కూడా ఈ సంగతి తెలిసే జింబాబ్వే పంపించమని కోరుతున్నాడు. అయితే... భారతదేశంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన జింబాబ్వే రాజన్ కు ఆశ్రయం ఇవ్వాలనుకోవడం లేదట. మరోవైపు చోటా రాజన్ కు ముప్పు ఉందన్న కారణంతో ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వబోమని కూడా భారత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయించుకుంటున్నందున గట్టిగా ఎదురుదాడి చేసే పరిస్థితుల్లో రాజన్ లేడు. అనారోగ్యంతో ఉండడంతో ఆయన కాస్త వీకయ్యాడని.. అందుకే చిక్కాడని చెబుతున్నారు.
మొత్తానికి చీకటి వ్యాపారాలు, నేరాలతోనే వేల కోట్లు సంపాదించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఛోటా రాజన్ ఆస్తులే ఇలా ఉంటే దావూద్ ఇబ్రహీం - అంతర్జాతీయ డ్రగ్ కింగ్ ల ఆస్తులు ఇంకెంత ఉంటాయో అంటున్నారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ ఇక ఇలాంటి వారి కోసం ఓ క్యాటగిరీ పెట్టాలేమో.