దశాబ్దాల తరబడి దొరక్కుండా తప్పించుకున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ పోలీసుల వద్ద ఉండటం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వే వెళ్లే క్రమంలో అతగాడిని ఇండోనేషియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఛోటాను పట్టుకున్న సమయంలో.. తనను ఎట్టి పరిస్థితుల్లో భారత్ కు అప్పగించొద్దని.. తనను జింబాబ్వేకు పంపేయాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా అందుకు భిన్నంగా.. ఛోటారాజన్ భారత కాన్సులేట్ కార్యాలయానికి ఒక లేఖ రాశాడు. తనకు ప్రాణహాని ఉందని.. తనను వెంటనే భారత్ కు తీసుకెళ్లిపోవాలంటూ కోరుతున్నారు. తనను భారత్ కు తరలించటానికి వెంటనే చర్యలు చేపట్టాలని భారత్ రాయబారుల్ని ఛోటా రాజన్ తాను రాసిన లేఖ ద్వారా వేడుకుంటున్నాడు. భారత్ రావటానికి ఛోటా రాజన్ మరీ ఇంత ఆసక్తిని ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు? ఛోటా వినతిపై భారత్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.