టీడీపీకి షాక్‌! ప్ర‌లోభపెట్టే స‌ర్వేల‌కు చెక్ ప‌డింది!

Update: 2017-08-21 04:50 GMT
నంద్యాల ఉప‌ ఎన్నిక‌ల సోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న టీడీపీ నేత‌ల ప్ర‌లోభాలు ఎక్కువ‌వుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. రోజులు గ‌డుస్తున్న కొద్దీ సామ‌దాన‌బేధదండోపాయాల‌న్నీ ఓట‌ర్ల‌పై ప్ర‌యోగిస్తున్నారు. డ‌బ్బు - మ‌ద్యం ఇలా.. ఓట‌ర్ల‌ను త‌మవైపు తిప్పుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు! ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి.. స‌ర్వేల పేరుతో మరో ప్ర‌చారానికి తెర‌లేపిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు వీట‌న్నింటిపై ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ కు ఫిర్యాదులు చేస్తూనే ఉంది. దీనిపై స్పందించిన‌ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌.. క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది.

స‌ర్వేలు - ఓపీనియ‌న్ పోల్స్‌ తో ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేయడంపై నిషేధం విధించింది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేలు - ఒపీనియన్‌ పోల్స్‌ పై నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ భన్వర్‌ లాల్‌ వెల్లడించారు. అంతేగాక కొంత‌మంది అత్యుత్సాహంతో ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఓటు వేస్తున్నార‌ని. ఇలా అడగడం చట్టవిరుద్ధమని ఆయన స్ప‌ష్టం చేశారు. సర్వేల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం - బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నారని ఫిర్యాదు అందిందని ఆయ‌న వివ‌రించారు.

అందుకే సర్వేలు - ఒపీనియన్‌ పోల్స్‌ ను నిషేధించామని భన్వర్‌ లాల్‌ తెలిపారు. ఏ చానల్‌ అయినా సర్వేలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భ‌న్వ‌ర్‌ లాల్‌ హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి సర్వేలు - ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించొద్దని - ప్రసారం చేయొద్దని తెలిపారు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను చెప్పుచేతల్లో పెట్టుకుందనే ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్న‌టికి మొన్న టీడీపీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్న డీజీపీని కూడా ఈసీపై బదిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే!
Tags:    

Similar News