ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతుంటాయి. అలాంటిది కీలకమైన ఎన్నికలకు కాస్త ముందుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అరుదైన అవకాశం లభించిన వేళ.. దాన్ని సుస్థిరం చేసుకోవాలనుకోవటం మామూలే. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కోలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తన ఇమేజ్ ను మరింత పెంచుకోవటానికి.. అందరి మనసుల్లో తనదైన ముద్ర వేసేందుకు ఒక్కో సీఎం ఒక్కోలాంటి ప్రయత్నం చేస్తారు.తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అలాంటి తీరునే ప్రదర్శించారు.
చిన్నారులు కొందరిని తన హెలికాఫ్టర్ లోఎక్కించుకున్న సీఎం చరణ్ జిత్ చన్నీ వారిని.. హెలికాఫ్టర్ లో తనతో పాటు జర్నీ చేయించి వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు.అనంతరం దీనికి సంబంధించిన చిట్టి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. హెలికాఫ్టర్ ను తమ జీవితంలో మొదటిసారి ఎక్కామని.. అది కూడా ముఖ్యమంత్రితో కలిసి ఎక్కటాన్ని తాము మర్చిపోలేమన్నారు.
ఇక.. పిల్లలతో కలిసి హెలికాఫ్టర్ ప్రయాణంపై ముఖ్యమంత్రి ఆనందానికి గురయ్యారు. తమది ప్రజా ప్రభుత్వమని.. పిల్లలతో చాపర్ రైడ్ పంచుకోవటం సంతోషంగా ఉందని.. అన్ని రంగాల్లో సమాన అవకాశాల్ని కల్పించటం ద్వారా వారికి ఉజ్వల.. సుసంపన్నమైన ఫ్యూచర్ ను అందిచటమే తమ ప్రయత్నంగా పేర్కొన్నారు. ఏమైనా.. పిల్లల్ని తనతో కలిసి హెలికాఫ్టర్ రైడ్ కు తీసుకెళ్లటం ద్వారా.. ఆయన చర్య ఆసక్తికరంగా మారింది. అందరిని ఆకర్షిస్తున్న ఈ వైనాన్ని చూసినప్పుడు సీఎంగా తాను సరికొత్త ఇమేజ్ తెచ్చుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పక తప్పదు.
Full View Full View Full View