ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డైలీ మెనూ.. ఇలా ఉంటుంది!

Update: 2021-07-03 11:55 GMT
సినిమా న‌టులు ఏం తింటారు? ఫిట్ గా ఉండ‌డానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? అనే ఆస‌క్తి జ‌నాల్లో ఉంటుంది. అయితే.. రాజ‌కీయ నాయ‌కుల‌కు సైతం ఫ్యాన్స్ ఉంటారు. వారి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? టెన్షన్ అన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి, వారి కోసం జ‌గ‌న్ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? అనే వివ‌రాలు ఇక్క‌డ అందిస్తున్నాం..

జ‌గ‌న్ ఎప్పుడూ చిరు న‌వ్వుతోనే క‌నిపిస్తుంటారు. అయితే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఆయ‌న ఫేస్ చేసే టెన్ష‌న్స్ అసాధార‌ణ‌మైన‌విగా ఉంటాయి. ప్ర‌జల‌కు మెరుగైన పాల‌న అందిస్తూ, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటూ, స్వ‌ప‌క్షంలోని అసంతృప్తుల‌ను చూసుకుంటూ.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు టైమ్ కేటాయించుకుంటూ.. గ‌డిపే జీవితం ఎంత హెక్టిక్ షెడ్యూల్ తో న‌డుస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇలాంటి ఒత్తిళ్ల‌ను ఎదుర్కొనేందుకు బ్రెయిన్ తోపాటు బాడీని సైతం ఫిట్ గా ఉంచుకోవ‌డం ఎంతో కీల‌కం. అయితే.. ఫిట్ నెస్ అనేది కేవ‌లం వ‌ర్క‌వుట్స్ కు సంబంధించిన విష‌య‌మే కాదు.. స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా ఎంతో ముఖ్యం. ఈ రెండింటి మేళ‌వింపుతోనే స‌రైన ఆరోగ్యం ఒన‌గూరుతుంది. మ‌రి, అలా చూసుకున్నప్పుడు జ‌గ‌న్ ఏం తింటారంటే..

ఉద‌యం 4.30 గంట‌ల‌కు టంచ‌న్ గా నిద్ర లేస్తారు. గంట సేపు జిమ్, యోగా వంటి వ‌ర్క‌వుట్స్ ఫినిష్ చేస్తారు. 5.30 గంట‌ల నుంచి గంట‌పాటు న్యూస్ తెలుసుకుంటారు. వార్తా ప‌త్రిక‌లు, నివేదిక‌లు వంటివాటికి కేటాయిస్తారు. ఈ స‌మ‌యంలో టీ తాగుతారు. ఫ్రెష‌ప్ అయిన త‌ర్వాత 7 గంట‌ల‌కు ఒక జ్యూస్ తీసుకుంటారు. ఇక‌, బ్రేక్ ఫాస్ట్ తీసుకోరు. ఆ త‌ర్వాత బ్రేక్ ఫాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. అల్లంతో చేసిన టీ తాగుతారు.

ఆ త‌ర్వాత సీఎస్ తోపాటుగా సీఎం కార్యాల‌యం అధికారుల‌తో అంశాల‌ను స‌మీక్షిస్తారు. లంచ్ లో అన్నం కంటే పుల్కాల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు. పుల్కాల్లో అన్నిర‌కాల‌ కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకుంటారు. లంచ్ లో అవ‌స‌రాన్ని బ‌ట్టి నాన్ వెజ్ ఉంటుంది. ఇందులో మ‌ట‌న్ కైమా రాగి సంక‌టిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. సీమ చిత్రాన్నం కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు జ‌గ‌న్‌. లంచ్ లో కుండ పెరుగు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది.

మ‌ధ్య మ‌ధ్య‌లో ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. సాయంత్రం వేళ టీ తాగుతారు. రాత్రి భోజ‌నంలో రైస్ లేదా పుల్కా ఉంటుంది. సండేస్ వంటి స్పెష‌ల్ డేస్ లో బిర్యానీ, చేప‌ల పులుసును ఆర‌గిస్తారు. ఈ విధ‌మైన మిత ఆహారాన్ని మాత్ర‌మే తీసుకుంటారు జ‌గ‌న్‌. ఇక‌, డైలీ టెన్ష‌న్స్ నుంచి రిలీఫ్ కోసం యోగా చేస్తారు. పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో, భ‌విష్య‌త్ పై సానుకూల ధృక్ప‌థంతో ముందుకు సాగ‌డ‌మే జ‌గ‌న్ విజ‌య ర‌హ‌స్యం అని చెబుతుంటారు సన్నిహితులు.
Tags:    

Similar News