మంత్రివర్గంలో ఉన్నవారిని ఏ ముఖ్యమంత్రి అయినా.. ఇలా అంటారా? ఈ విధంగా వారి పరువును బజారున పడేస్తారా? అంటే.. కాదనే అంటారు. కానీ, ఎన్డీయే పాలిత రాష్ట్రం అందునా.. ఈశాన్య రాష్ట్రం.. మిజోరం ముఖ్యమంత్రి మాత్రం.. ఉన్నది ఉన్నట్టు స్పష్టం చేశారు. ``మా మంత్రులు శుద్ధ మొద్దలు.. వారికి ఇంగ్లీష్ రాదు.. హిందీ అంతకన్నా రాదు.. ఏదైనా మీరే చేయాలి..`` అంటూ.. మిజోరం ముఖ్యమంత్రి.. ఏకంగా.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ సంధించారు. దీంతో ఇప్పుడు ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే.. మంత్రుల విద్యా సంబంధిత అంశాన్ని సీఎం.. బట్టబయలు చేయడమే!
ఇంతకీ ఏం జరిగిందంటే.. మిజోరం రాష్ట్రానికి కేంద్రం తాజాగా ఒక సీనియర్ అధికారి రేణు శర్మను.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీనిపై అక్కడి అధికారుల మాట ఎలా ఉన్నా.. మంత్రులు మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే రేణు శర్మ.. ఉత్తరాదికి చెందిన అధికారి. పైగా సీనియర్. దీంతో ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషలు కొట్టిన పిండి. కానీ.. ఆయనకు స్థానిక భాష `మిజో`లో అక్షరం ముక్కరాదు. దీంతో ఏం చేయాలన్నా.. అన్నీ ఇంగ్లీష్ లేదాహిందీలోనే చేస్తున్నారు. అధికారులను కూడా ఇదే ఫాలో కావాలని కోరుతున్నారు. సరే.. అధికారులకు ఇంగ్లీష్‌పై పట్టు ఉంటుందని కాబట్టి ఇబ్బందిలేదు.
కానీ, మిజోరంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు.. సీనియర్ నాయకులే అయినప్పటికీ.. గడప దాటకపోవడంతో.. ఇక్కడ వారికి భాషాపరమైన సమస్య ఏర్పడింది. వారికి ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. పోనీ.. జాతీయ భాష అయిన.. హిందీ పైనైనా అవగాహన ఉందా? అంటే.. ``ఇదరాయియే`` టైపు! దీంతో వారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్య భాషా పరమైన దూరం పెరిగిపోయింది. ఫలితంగా ఏ పనీ ముందుకు సాగడం లేదు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి జోరాంతంగా.. కేంద్రానికి లేఖ సంధించారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు.
``మా మంత్రులకు హిందీ రాదు. ఇంగ్లీష్ అంతకన్నా తెలీదు. మీరేమో.. హిందీ, ఇంగ్లీష్ తప్ప.. ఇంకేమీ రాని అధికారిని ఇచ్చారు. ఆయనతో మా మంత్రులు పడరాని పాట్లు పడుతున్నారు. సో.. సీఎస్‌ను మార్చి పుణ్యం కట్టుకోండి. మిజో భాషపై పట్టున్న అధికారిని మాకు ఇవ్వండి`` అంటూ..కేంద్రాని తంగా లేఖ రాశారు. ప్రస్తుతం దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ.. మంత్రుల అక్షరాస్యతపై స్వయంగా సీఎం నిజాలు బయటపెట్టారంటూ.. నెటిజన్లు మాత్రం కామెంట్లు చేస్తున్నారు.