`నాక్కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది...అది అమెరికన్ల కోణంలో చూస్తే మీకు అర్థమవుతుంది` అన్నట్లుగా...స్వదేశీ మంత్రం జపిస్తూ...వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ...నైపుణ్యాలను నమ్ముకొని అమెరికా వైపు చూస్తున్న వారిని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవరపాటుకు గురిచేస్తున్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ట్రంప్ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది భారతీయులే అని కూడా విశ్లేషించాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే, భారత్ మథనపడిపోతున్న సమయంలో ట్రంప్ వైఖరి అభినందనీయమని పలువురు అంటున్నారు. పక్కనే ఉన్న చైనా కంటే కాస్త తిక్కున్న ట్రంప్ మేలంటున్నారు.
వివరాల్లోకి వెళితే...పుల్వామాలో ఉగ్రవాదులు రాక్షస దాడి చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ పట్ల అనుసరిస్తున్న దుర్నీతిని చైనా మరోసారి చాటుకొని పాక్ పట్ల ప్రేమ చూపించింది! అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై అమెరికా మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.!! పుల్వామా ఉగ్ర ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించిన అమెరికా.. ఉగ్రవాదులను పాక్ చేరదీయరాదని - వారికి మద్దతు ఇవ్వడాన్ని తక్షణమే మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ గురువారం అర్ధరాత్రి ఓ ప్రకటన చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నదని - ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ - అమెరికా మధ్య సహకారాన్ని - సమన్వయాన్ని పెంపొందించుకోవాలన్న దృఢ సంకల్పాన్ని ఈ దాడి మరింత బలోపేతం చేసిందన్నారు. అంతకుముందు స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో.. ఉగ్రవాదంపై భారత్ తో కలిసి పోరాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
కాగా, పుల్వామాలో ఉగ్ర ఘాతుకం పై చైనా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే, జేఈఎం అధిపతి మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేసేందుకు ఐక్యరాజ్య సమితిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తామని మాత్రం హామీ ఇవ్వలేదు. పుల్వామా ఉగ్రదాడిపై మీడియా అడిగిన ప్రశ్నలకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఆచితూచి స్పందించారు. ఈ దాడి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన బీజింగ్ లో అన్నారు. ఐరాస ఇప్పటికే జేఈఎంను ఆంక్షల జాబితాలో చేర్చిందని, ఆ సంస్థ నాయకుడిపై నిషేధం విధించేందుకు చైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నదో ఇప్పుడే చెప్పదల్చుకోలేదని తెలిపారు.