వ్యాఖ్యలు మహారాణివి.. బ్యాన్ మాత్రం బీబీసీ మీద..

Update: 2016-05-12 04:38 GMT
బ్రిటన్.. చైనాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. చైనా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు వీడియో రికార్డు కావటం.. చైనాలో అవి ప్రసారం కావటం జరిగిపోయాయి. దీంతో.. చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బ్రిటన్ కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అయిన బీబీసీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

చైనాకు అంతలా మంట పుట్టే మాటను మహారాణి ఎలిజబెత్ 2 ఏం అన్నారన్న విషయంలోకి వెళితే.. గత అక్టోబరులో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. ఆయన సతీమణితో కలిసి బ్రిటన్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారితో వచ్చిన ప్రతినిధుల్లో ఒకరు రాయబారితో అమర్యాదగా వ్యవహరించినట్లు పోలీస్ కమాండర్ తో  రాణి మాట్లాడిన మాటలు బీబీసీ చిత్రీకరించిన వీడియోలో రికార్డు అయ్యాయి.

వాస్తవానికి ఇలాంటివి చోటు చేసుకోవటం మహా అరుదు. అందులోకి మహారాణి నోటి నుంచి ఇలాంటి మాటలు రావని చెబుతున్నారు. అలాంటిది మహారాణి నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారటమే కాదు.. వివాదాస్పదంగా మారాయి. బీబీసీ ప్రసారం చేసిన ఈ వీడియో విడుదలైన కాసేపటికే చైనా ప్రభుత్వం బీబీసీ మీడియా సంస్థను చైనాలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మహరాణి నోటిమాట బీబీసీ మీద వేలు పడేలా చేసింది.
Tags:    

Similar News