కూలిన భవనం శిథిలాల కింద కరోనా బాధితులు

Update: 2020-03-08 06:39 GMT
కరోనావైరస్ ప్రజల ప్రాణాలను తీస్తూనే ఉంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాలు హరించడమే కాదు ఇప్పుడు చైనాలో ప్రమాద రూపంలోనూ పదుల సంఖ్యలో వైరస్ పీడితుల ప్రాణాలు బలిగొంది. కరోనా బాధితుల కోసం చైనాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోటల్ కూలిపోయింది. ఫూజియన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ సిటీలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. రక్షణ చర్యలు ప్రారంభించిన అధికారులు 34 మందిని రక్షించారు.

చైనాలో కరోనా విజృంభించడంతో స్థానికంగా ఉన్న ఓ హోటల్ ను క్వారంటైన్ గా మార్చారు. 80 రూములున్న ఈ హోటల్ కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. ఫూజియన్ ప్రావిన్స్ లో శుక్రవారం వరకు 296  కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 10,819 మంది అనుమానితులను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

పీపుల్స్ డైలీ కథనం ప్రకారం ఈ హోటల్‌ ను 2018 జూన్‌ లో ప్రారంభించారు. దీనిలో 80 గదులు ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో అనుమానిత రోగులను ఇక్కడ ఉంచి, చికిత్స చేస్తున్నారు. కాగా చైనాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరణాల జోరు తగ్గింది. అయితే, పూర్తిగా నిర్మూలించే క్రమంలో అనుమానం ఉన్న వారందరినీ ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. అలా చికిత్స చేస్తున్న భవనం కూడా కూలిపోవడం అందరినీ షాక్‌కి గురిచేసింది.
Tags:    

Similar News