గోవాలో రెండు రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ సమావేశం ప్రధాని మోడీకి పెద్దగా ప్రయోజనం లభించలేదన్న అభిప్రాయం వ్యక్తమువుతున్న వేళ.. ఆయనకు షాకిచ్చేలా చైనా తన చెత్తబుద్ధిని మరోసారి చాటుకుంది. ఎవరు ఎన్ని అనుకున్నా.. పాకిస్థాన్ తన శాశ్విత మిత్రుడన్న విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేసింది. ఉగ్రవాదం పాకిస్థాన్ కు పుట్టిల్లు లాంటిదంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మోడీ మాటలకు కౌంటర్ అన్నట్లుగా తాజాగా చైనా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలు.. భారత్ కు ఇబ్బంది పెట్టేవన్న భావన వ్యక్తమవుతోంది.
పొరుగున ఉన్న దేశం.. ఉగ్రవాదానికి పుట్టిల్లు లాంటిదంటూ బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించిన తర్వాతి రోజున.. తన మిత్రుడ్ని వెనకేసుకొచ్చిన చైనా.. ఉగ్రవాదాన్ని ఏ దేశంతోనో.. ఏ మతంతోనో ముడిపెట్టలేదంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చి మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.
గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి హు చున్యింగ్ కాసింత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై చైనా వైఖరి ఎంతమాత్రం మారలేదంటూనే.. ఉగ్రవాదాన్ని ఏ దేశానికో.. ఏ మతానికో ముడిపెట్టినట్లుగా మాట్లాడటం సరికాదన్న వాదనను వినిపించటమే కాదు.. చైనా.. పాకిస్థాన్ అన్ని కాలాల్లోనూ శాశ్విత మిత్రుడన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ‘‘భారత్.. పాకిస్థాన్ లురెండు ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవటంలో పాకిస్థాన్ గొప్పత్యాగాలుచేసింది. అంతర్జాతీయ సమాజం దీన్ని గుర్తించాలి. భారత్.. పాకిస్థాలు మాకు ఇరుగుపొరుగు దేశాలు. ఈ రెండు దేశాలు తమ మధ్యనున్నసమస్యను చర్చలు.. సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం’’ అంటూ చైనా తన మాటలతో పాక్ పై తన వైఖరి ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేసేసింది. తాజా వ్యాఖ్యలు మోడీని ఇబ్బంది పెట్టేవిగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/