తమిళనాడు రాజకీయం రసకందాయంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్షను అనుభవించిన చిన్నమ్మ శశికళ.. రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే అన్నాడీఎంకేలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అయితే.. అలాంటిదేమీ లేకపోవటంతో డీలా పడ్డారు. తాను ఎంట్రీ ఇవ్వటంతోనే అన్నాడీఎంకే నుంచి వలసలు చోటుచేసుకుంటాయని భావించారు. అన్నాడీఎంకేలో అమ్మ తర్వాత స్థానం తనదేనన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న యోచనలో ఉన్న శశికళ.. ఆ దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
గొడవ పడటంతో తాను అనుకున్నది సాధ్యం కాదని డిసైడ్ అయిన ఆమె.. రాజీ ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ రోజు అమ్మ జయంతి కావటంతో.. తన బలాన్ని ప్రదర్శించాలని భావించిన ఆమె సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ రోజున అమ్మకు నివాళులు అర్పించేందుకు శశికళ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. దర్శకుడు భారతీరాజా..నటీనటుటు రాధికా శరత్ కుమార్ తదితర తారలు వెళ్లారు.
దీంతో.. అమ్మ తర్వాత అన్నాడీఎంకేలోతనదే పైచేయి అన్న సంకేతాల్ని పంపే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. అమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె కీలక ప్రకటన చేశారు. టీ నగర్ లోని తన నివాసం బయట కార్యకర్తల్ని ఉద్దేశించి ఆమె ాట్లాడుతూ.. అమ్మ నిజమైన కేడర్ ఏకం కావాలని.. అందరూ అన్నాడీఎంకే కోసం సమిష్ఠిగా పని చేయాలన్నారు. అమ్మ కోరుకున్నట్లుగా వందేళ్ల పాటు అధికారంలో ఉండేలా పని చేయటమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
అందుకోసం అన్నాడీఎంకేతో కలిసి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కలిసి పని చేస్తుందని చెప్పటం ద్వారా.. అన్నాడీఎంకే చీలకలు ఏకం కావాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. మరి..చిన్నమ్మ సెంటిమెంట్ ప్రకటనపై అన్నాడీఎంకే అన్నీ తామై వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి పళనిస్వామి.. మరో కీలక నేత పన్నీర్ సెల్వం ఇద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించటం తెలిసిందే. మరి.. తాము తీసుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? కలిసి పని చేస్తారా? లేదంటే.. ఆమె ప్రకటనకు స్పందించకుండా మిన్నకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.