టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రిపూట అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. కనీసం ట్యాబ్లెట్లు వేసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని...దౌర్జన్యంగా అచ్చెన్నను అరెస్టు చేశారని పలువురు టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు. అచ్చెన్న అరెస్టుకు నిరసనగా ఆందోళన చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చింతమనేనికి హైకోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా బెయిల్ పై విడుదలైన చింతమనేని....ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ధృతరాష్ట్రుడితో పోలుస్తూ చింతమనేని షాకింగ్ కామెంట్స్ చేశారు.
జైలు నుంచి విడుదలైన చింతమనేని....సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు, మహాభారతంలోని ధృతరాష్ట్రుడికి ఏమాత్రం తేడా లేదని చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే తనను వేధిస్తున్నారని, అందుకే తనను అరెస్టు చేయించారని అన్నారు. అచ్చెన్న అరెస్టుకు నిరసనగా ఆందోళన చేయడానికి వెళ్లిన తనను ఆందోళన కార్యక్రమాలు వద్దని వారించారని చెప్పారు. పోలీసుల మాట విని వెంటనే తాను తిరిగి వెళుతున్నానని, కానీ, ఆ సమయంలో పోలీసులు తనను కావాలనే అరెస్ట్ చేశారని చెప్పారు. తనపై అక్రమ కేసు బనాయించారని, హైకోర్టులో తనకు న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపారు. అచ్చెన్నాయుడిపై కూడా అక్రమ కేసు పెట్టి, అరెస్ట్ చేశారని, ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న చెప్పినా వినకుండా అదుపులోకి తీసుకున్నారని అన్నారు.