రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలకు శ్రీకారం

Update: 2020-03-14 11:30 GMT
శ్రీరామనవమి సందడి తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ఇప్పటికే ఆలయాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు హిందూ సంస్థలు - పీఠాధిపతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్షలు నిర్వహించనున్నట్లు మహా విద్యాపీఠం - ధర్మ జాగరణ సమితి ప్రకటించింది. మార్జి 25 నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామదీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మహా విద్యాపీఠం వ్యవస్థాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే శ్రీరామదీక్ష యజ్ఞం చేపట్టడానికి దాదాపు లక్ష మంది అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు - జపమాలలు - బ్యానర్లు - జెండాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపినట్లు వెల్లడించారు. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద పాఢ్యమి నుంచి ఏప్రిల్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీరామదీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షాకాలంలో ఉభయ సంధ్యల్లో స్నానం ఆచరించి దీపారాధన చేసి శ్రీరామ రక్షాస్తోత్రం పఠనం చేయాలని సూచించారు. ఈ దీక్షలో పాల్గొనడం వలన శ్రీరాముడి కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. మొదటి సంవత్సరమే దాదాపు లక్షకు పైగా భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొననున్నారని.. ఈ స్ఫూర్తితో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. శ్రీరామదీక్ష కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన శ్రీరామ జన్మస్థానమైన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాన్ని మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వరంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.s
Tags:    

Similar News