టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనో కింగ్ మేకర్.. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట.. దెందలూరు ఎమ్మెల్యేగా ఆయన దూకుడు చూసి మోనార్క్ ఎమ్మెల్యే అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యేల్లోనే అత్యంత వివాదాస్పదుడైన ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ టీడీపీ హయాంలో చేయని చర్యలు లేవు.. నోటిని అదుపులో పెట్టుకుందీ లేదు..
కానీ కాలం మారింది. టీడీపీ అధికారం కోల్పోయింది. ఈ వివాదాస్పద చింతమనేని ప్రభాకర్ కూడా దెందలూరు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. కానీ ఆ దూకుడు వీడలేదు. అందుకే ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలా కేసుల్లో ఇరుకున్నారు చింతమనేని ప్రభాకర్. కానీ చంద్రబాబు ప్రోత్సాహం.. అధికారం అండతో ఆయనపై ఒక్క కేసు విచారణకు రాలేదు.కానీ వైసీపీ అధికారంలోకి రాగానే బాధితులంతా రోడ్డెక్కడం.. ఆయనపై వరుస కేసులు నమోదుకావడంతో చెలరేగిపోయిన ఇతడు పారిపోయాడు. టీడీపీ చరిత్రలోనే పారిపోయిన నేతగా పేరుగాంచాడు.
అయితే ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం వరుస కేసుల్లో రిమాండ్ లో ఉన్నాడు. మరో 15రోజుల పాటు ఆయన రిమాండ్ ఉండగా.. ఆయన టీడీపీ హయాంలో చేసిన దాష్టీకాలకు వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో యాభైకి పైగా కేసుల్లో ఆయన జైల్లోనే మళ్లీ అరెస్ట్ కావడం.. మళ్లీ రిమాండ్ కు వెళ్లడం జరుగుతూనే ఉంది. అలా వరుసగా కేసులు నమోదు కావడం.. రిమాండ్ లు కొనసాగుతున్నాయి.
ఇప్పటికీ చింతమనేని జైల్లోనే నాలుగు సార్లు అరెస్ట్ అయ్యాడు. వచ్చే నెల 9వ తేదీ వరకూ రిమాండ్ ను పొడగించింది కోర్టు. నాలుగో అరెస్ట్ తో రిమాండ్ మరింత కాలం కొనసాగించింది. ఇక వరుస కేసుల్లో ఇంకా అరెస్ట్ లు, రిమాండ్ లు పొడిగింపు చేసి జైల్లోనే కాలం గడిపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక చింతమనేని నాటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్షపడింది. దానిపై అప్పీల్ కు వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఆ కేసుల్లో కూడా ఉచ్చు బిగియడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇలా యాభైకి పైగా కేసులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. చింతమనేని ఇప్పట్లో బయటపడే అవకాశాలే లేవని తెలుస్తోంది..