ఒక విధంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి నటులకు ఆయన అచార్యుడే. యాక్టర్ గా సీనియర్ గా ఉన్న చిరంజీవి అందరికీ పెద్ద మాస్టర్ వంటి వారే. దానికి తోడు ఆయన తాజా సినిమా పేరు కూడా ఆచార్యగా పెట్టారు. అలా ఇపుడు మెగాస్టార్ కాస్తా ప్రతీ ఒక్కరికీ ఆచార్యుడు అయిపోయారు.
ఆయన ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళి విందారగించారు. సినీ సమస్యలను కూడా ప్రభుత్వానికి నివేదించారు. అయితే చిరంజీవి జగన్ నివాసానికి చేరుకున్నపుడు ఆయనకు అక్కడ జగన్ చేసిన అతిధి మర్యాదలు ఇపుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కారులో తాడేపల్లిలోని సీఎం ఇంటికి చేరుకున్న చిరంజీవి కారు దిగగానే జగన్ ఎదురేగి వచ్చి రండి ఆచార్యా.. వెల్ కమ్ ఆచార్యా అంటూ స్వాగతం పలకడం మాత్రం ముచ్చట గొలిపిందనే అంటున్నారు.
దాంతో చిరంజీవి ఉబ్బితబ్బిబ్బు అయ్యారట. ఆ తరువాత చిరంజీవి మరెప్పుడు తరువాత అపాయింట్మెంట్ అని జగన్ని అడగగా మీరు ఎపుడంటే అపుడే. అలా వచ్చినపుడు భోజనానికి మాత్రం తప్పకుండా రావాలన్నా అంటూ జగన్ చెప్పారట.
మొత్తానికి ఈ రకంగా జగన్ అతిధి మర్యాదలు చేయడంతో మెగాస్టార్ ఎంతో మురిసిపోయారు అంటున్నారు. అంతే కాదు చిరంజీవి చెప్పిన అన్ని విషయాలను ఆయన జాగ్రత్తగా కాగితం మీద రాసుకున్నారుట. మొత్తానికి చిరంజీవిని అన్నా అంటూ గౌరవించడమే కాకుండా ఆయన చెప్పిన తీరుగానే సమస్య పరిష్కారానికి జగన్ కృషి చేస్తారని అంటున్నారు.
సినిమా సమస్యలను పక్కన పెడితే మరో హీరో నాగార్జున చెప్పినట్లుగా చిరంజీవి అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం అని అంటున్నారు. అందుకే ఆయనకు ఎపుడూ జగన్ విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ మెగానుబంధం ఎంతదాకా సాగుతుందో.