రమ్మనడం కాదు.. చేతల్లో చూపండి -చిరు

Update: 2016-04-11 03:46 GMT
ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. సినీ పరిశ్రమ వైజాగ్ లో అభివృద్ధి చెందడంపై.. చాలానే మాటలు వినిపించాయి. కానీ ఈ టాపిక్ పై ఓపెన్ గా ప్రభుత్వానికి సలహాలు - సూచనలు ఇచ్చినవారు ఎవరూ లేరు. కానీ అటు రాజకీయ నాయకుడిగా - ఇటు ఇండస్ట్రీలో సీనియర్ గా ఉన్న చిరంజీవి.. ఏపీ ప్రభుత్వానికి నేరుగానే పంచ్ లు వేశారు.

'విశాఖలో ఈ సభ ఇంత సక్సెస్ ఫుల్ గా జరగడానికి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడమే కారణం. విశాఖలో సభ జరగాలని అల్లు అరవింద్ ని ప్రోత్సహించిన గంటా శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నా. అదే మంత్రి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విన్నపం. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి. చెన్నై నుంచి వచ్చి హైద్రాబాద్ లో ఎలా అయితే అభివృద్ధి చెందిందో... అదే రకంగా  ఫైనాన్షియల్ కేపటిల్ అయిన విశాఖలో గ్లామర్ ఫీల్డ్ అభివృద్ధి చెందాలి.' అన్నారు చిరంజీవి. ఇక్కడితో ఆగిపోతే ఆయన పొలిటికల్ లీడర్ ఎలా అవుతారు.

'రండి అని అనడమే కాదు.. ఈ స్థలాలు ఇస్తాం - స్టూడియోలకు ఈ తరహా వసతులు - ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం. హైద్రాబాద్ లో చిత్రపురి కాలనీ మాదిరిగా.. 24 క్రాఫ్ట్స్ కు ఫెసిలిటీస్ కల్పిస్తాం అని గిరిగీసి ఏర్పాట్లు చేయండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇక్కడకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపండని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా' అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు డైరెక్ట్ గానే పంచ్ వేసేశారు మెగాస్టార్ అండ్ కాంగ్రెస్ లీడర్ చిరంజీవి.
Tags:    

Similar News